Stress : ఒత్తిడి, ఆందోళనలతో సతమతమౌతుంటే?…

ఆకుకూరల్లో ఉండే మెగ్నీషియం కూడా ఆందోళనను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే ఫొలేట్‌, విటమిన్‌ బి6, బి12లు ఉండేలా రోజువారీ ఆహారాన్ని ప్లాన్‌ చేసుకోవాలి.

Stress

Stress : ఆందోళన అనేది ఒక మానసిక మైన వ్యాధి. మనిషిలో ఆందోళన ఉంటే మనస్సు ప్రశాంతంగా ఉండదు. మందులతో నయంకాని ఈ సమస్యను మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవటం ద్వారా తగ్గించుకోవచ్చు. ఆధునిక జీవితంలో చాలామంది ఒత్తిడి, ఆందోళనకు గురువుతున్నారు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. కొంతమంది ఉరుకుల, పరుగుల ఉద్యోగాలతో సతమతమవుతుంటే మరికొందరు కుటుంబ సమస్యల వల్ల ఒత్తిడికి లోనవుతున్నారు. వీటి నుండి బయటపడేందుకు ఆహార, జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

సిట్రస్‌ ఫలాలు సానుకూల ఆలోచనలనూ పెంచుతాయట. కామోమైల్‌ టీలో యాంటీ ఆక్సిడెంట్లతోపాటు ఆత్రుతను తగ్గించే గుణాలుంటాయి. వీటినీ తరచుగా ఆహారంలో భాగం చేసుకుంటుండాలి. డార్క్‌ చాక్లెట్‌లో థియోబ్రొమైన్‌ ఉంటుంది. ఇదీ యాంగ్జైటీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. పులిసిన పదార్థాలతో చేసే ఇడ్లీ, దోశ వంటివీ దీనికి చక్కని మందు. ఒమేగా-3 సమృద్ధిగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఇవి ఆందోళనను తగ్గించడంలో సహాయపడతాయి. నెయ్యి వంటి ఆహారాలలో ఒమేగా-3 పుష్కలంగా ఉంటుంది. ఆహారంలో ప్రతిరోజూ కనీసం 1 టీస్పూన్ నెయ్యి తీసుకోవాలి.

పెరుగు మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది బ్యాక్టీరియా, లాక్టోబాసిల్లస్, బిఫిడోబాక్టీరియా మూలకాలను కలిగి ఉంటుంది. ఆహారంలో పెరుగును చేర్చుకోవడం వల్ల గట్ సహజ బ్యాక్టీరియాకు ప్రయోజనం చేకూరుతుంది. ఆందోళన ఒత్తిడి తగ్గుతుంది. గుమ్మడి గింజల్లో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్‌లను సమతుల్యం చేయడంతో పాటు రక్తపోటునూ తగ్గిస్తుంది. గుమ్మడి గింజలు, అరటిని తరచుగా తీసుకుంటే ఒత్తిడి, ఆందోళనకు దూరంగా ఉండొచ్చు.

మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు అరటిపండ్లు, గుమ్మడికాయ గింజలు పొటాషియం, మెగ్నీషియంలకు మూలాలు. ఇవి ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌ను నియంత్రించడంలో, రక్తపోటును నియంత్రించడంలో ఉపకరిస్తాయి. ఈ ఆహారాలను తినడం వల్ల ఒత్తిడి, ఆందోళన లక్షణాలను తగ్గించుకోవచ్చు. ఆకుకూరల్లో ఉండే మెగ్నీషియం కూడా ఆందోళనను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే ఫొలేట్‌, విటమిన్‌ బి6, బి12లు ఉండేలా రోజువారీ ఆహారాన్ని ప్లాన్‌ చేసుకోవాలి.

అదే సమయంలో శరీరం డీ హైడ్రేషన్ బారిన పడకుండ చూసుకోవాలి. ఇందుకోసం రోజులో ఏడు నుండి ఎనిమిది గ్లాసుల నీటిని తప్పనిసరిగా తీసుకోవాలి. బీన్స్ను, సోయాబీన్స్ ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల వీటిలో ఉండే ప్రొటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ మీరు చేసే పనిపై దృష్టి కేంద్రీకరించేలా దోహదం చేస్తాయి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. సమయానికి తినడం, నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజూ ధ్యానం చేయడం, వ్యాయామం చేయడం అవసరం.

ఒత్తిడిని కంట్రోల్‌లో పెట్టుకోవాలంటే ముందుగా పాజిటివ్ దృక్పథాన్ని అలవరచుకోవాలి. మానసికోల్లాసాన్ని కలిగించే కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. ఇలా చేయటం వల్ల హార్మోన్లు సమతులమై భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. ఫలితంగా మనసుపై ఒత్తిడి లేకుండా ప్రశాంతత చేకూరుతుంది.