Hemoglobin : అలసట, నిస్సత్తువ కారణం ఏమైఉంటుందనేగా?

శరీరంలో కణాలు పనిచేయాలంటే ఆక్సిజన్ అవసరం. ఎర్ర రక్తకణాలలో ఆక్సిజన్ ను హిమోగ్లోబిన్ అనే ప్రొటీన్ తీసుకు వెళుతుంది. దీనిలోనే ఐరన్ కూడా ఉంటుంది. ఈ హిమో గ్లోబిన్ శాతాన్ని జీఎంజి డీఎల్ గా కొలుస్తారు.

Fatigue

Hemoglobin : చాలా మంది అలసట, నిస్సత్తువ సమస్యతో బాధపడుతున్నారు. దీని కారణం పనిఒత్తిడిగా భావిస్తారు. వాస్తవానికి చాలా మందిలో పని వత్తిడి కారణంగా అలసట ఉండే అవకాశం ఉన్నప్పటికీ రక్తహీనత ఉన్నవారిలో సైతం అలసట వస్తుంది. అయితే దీనిని ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. సమస్యను లైట్ గా తీసుకుంటారు. ముఖ్యంగా ఈ సమస్య మహిళల్లో అధికంగా కనిపిస్తుంది. గర్భిణీల్లో, పాలిచ్చే తల్లుల్లో, రజస్వల అయిన అమ్మాయిల్లో రక్తహీనత సమస్య కనిపిస్తుంది.

శరీరంలో కణాలు పనిచేయాలంటే ఆక్సిజన్ అవసరం. ఎర్ర రక్తకణాలలో ఆక్సిజన్ ను హిమోగ్లోబిన్ అనే ప్రొటీన్ తీసుకు వెళుతుంది. దీనిలోనే ఐరన్ కూడా ఉంటుంది. ఈ హిమో గ్లోబిన్ శాతాన్ని జీఎంజి డీఎల్ గా కొలుస్తారు. ఇది 13 శాతం కన్నా తక్కువగా ఉంటే మన శరీరంలో తగినంత ఐరన్, ఆక్సిజన్ లు అందవు. కొన్ని సందర్భాలలో ఆక్సిజన్ తక్కువగా ఉండటం వల్ల గుండెపై ఒత్తిడి పడుతుంది. దీంతో గుండెనొప్పి వస్తుంది. హిమోగ్లోబిన్ శాతం 7జీఎం డీఎల్ కన్నా తక్కువ అయితే త్వరగా అలసిపోవటం, తలనొప్పి, కళ్లు తిరగటం, ఏకాగ్రత లేకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాంటి సమయంలో విటమిన్ బీ12, ఐరన్ లను వృద్ధి చేసే మందులను వైద్యులు సిఫార్సు చేసిన మోతాదులో తీసుకోవాలి.

హిమోగ్లోబిన్ శాతం బాగా తక్కువగా ఉండే వైద్యుల సలహాతో మందులు వాడుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే సరిపోతుంది. కాయగూరలు, ఆకు కూరలతో పాటుగా, గుడ్లు, మాంసం, లివర్, రొయ్యలు, వంటి వాటినితీసుకోవటం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది. కాయగూరల్లో నిమ్మరసం కలుపుకుని తీసుకుంటే ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఏడాదికి ఒకసారైనా హిమోగ్లోబిన్ శాతాన్ని పరీక్షచేయించుకోవటం మంచిది.