Hemoglobin : శరీరంలో హిమోగ్లోబిన్ మోతాదు ఎంత ఉండాలంటే?

రక్తహీనత సమస్యను తగ్గించు కోవటానికి కొన్ని ఆహారాలను అధికమొత్తంలో తీసుకోవాల్సి ఉంటుంది. మాంసకృత్తులతో పాటు ఐరన్ లభించే పోషక పదార్ధాలను తినటం వల్ల హిమోగ్లోబిన్ ను పెంచుకోవచ్చు.

Hemoglobin

Hemoglobin : మన శరీరంలోని రక్తం ఎర్రగా ఉండడానికి కారణం అందులోని హీమోగ్లోబిన్ అనే పదార్థం. రక్తంలో ఉన్న ఆక్సిజన్ ను గ్రహించి శరీరంలోని ఇతర భాగాలకు చేరవేయటంలో హిమోగ్లోబిన్ సహాయపడుతుంది. హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే నీరసం,ఆకలి లేమి, నిద్రలేకపోవటం, మలబద్దకం, వాంతివచ్చినట్లు ఉండటం, ఆకలి లేకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇటీవలి కాలంలో రక్తహీనత సమస్య అనేది చాలా ఎక్కువగా కనపడుతుంది. ఈ సమస్యను అసలు అశ్రద్ద చేయకూడదు. ఐరన్ సమృద్దిగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి.

మన శరీరంలో హీమోగ్లోబిన్ మగవారిలో ప్రతి 100 గ్రాముల రక్తంలో 13 గ్రాములు, ఆడవారిలో 12 గ్రాములు, 6 సంవత్సరంలోపు పిల్లల్లో 11 గ్రాములు, గర్భిణీ స్త్రీలలో 11 గ్రాములు, బాలింతలలో 12 గ్రాములు, 6 నుండి 12 సం.ల లోపు పిల్లలలో్ 12 గ్రాములు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. హీమోగ్లోబిన్ మోతాదు ఈ విలువల కన్నా తగ్గితే రక్త హీనతతో బాధపడుతున్నట్లు అర్ధం చేసుకోవాలి.

రక్తహీనత సమస్యను తగ్గించు కోవటానికి కొన్ని ఆహారాలను అధికమొత్తంలో తీసుకోవాల్సి ఉంటుంది. మాంసకృత్తులతో పాటు ఐరన్ లభించే పోషక పదార్ధాలను తినటం వల్ల హిమోగ్లోబిన్ ను పెంచుకోవచ్చు. ఖర్జూరంలో ఉండే ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. నువ్వులు తీసుకోవటం వల్ల హిమోగ్లోబిన్ స్ధాయిలు ఊహించని విధంగా పెరుగుతాయి. రోజుకి ఒక టీ స్పూన్ నువ్వులు తింటే రక్తం సంవృద్ధిగా తయారవుతుంది.

శరీరంలో రక్తం పెరుగుదలకు బీట్ రూట్ దోహదపడుతుంది. ఇందులో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. రోజూ ఒక యాపిల్ తింటే రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. దానిమ్మను రోజూ తింటే శరీరంలో రక్తం వృద్ధి చెందుతుంది. వీటితోపాటు పప్పులు, నల్ల శనగలు, అలసందలు, ఉలవలు, సోయాబీన్స్‌, చిక్కుళ్లు మొదలైన గింజలను తీసుకుంటే రక్తంహీనత నుండి బయటపడవచ్చు. తోటకూర, పాలకూర, గోంగూర వంటి ఆకుకూరలు తప్పనిసరిగా ఆహారంలో బాగం చేసుకోవాలి.