Protein : శరీర నిర్మాణంలో మాంసకృత్తుల పాత్ర ఎంతంటే?..

మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు మూడూ కలిపి లోపలకు వెళితే శరీరం శక్తి కొరకు పిండి, కొవ్వు పదార్థాలను వాడుకుని, శరీర నిర్మాణానికి, ఇతర పనులకు మాంసకృత్తులను ఉపయోగించుకుంటుంది.

Befunky Photo (1)

Protein : శరీర నిర్మాణానికి మాసంకృత్తులు అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఇల్లు నిర్మించాలంటే ఇటుకలు ఎలా అవసరమౌతాయో, మన శరీర నిర్మానానికి మాంసకృత్తులు అలా ఉపయోగపడతాయి. ఒక రోజులో కేజీ బరువుకి ఒక గ్రాము మాంసకృత్తులు అవసరం అవుతాయి. 50కేజీల బరువు కలిగి ఉన్నవారైతే రోజుకు 50 గ్రాముల మాంసకృత్తులు అవరం అవుతాయి. అలాగే ఎదిగే వయస్సులో ఉన్న పిల్లలకు రెట్టింపు మాంసకృత్తులు కావాల్సి ఉంటుంది.

ప్రతి రోజూ శరీరంలో కోట్ల కణాలు చనిపోతూ ఉంటాయి. చనిపోయిన కణాల స్థానంలో క్రొత్త కణాలను నిర్మించుకునే నిమిత్తం శరీరానికి మాంసకృత్తులు కావాలి. జబ్బున పడిన కణాలను రిపేరు చేసుకునేందుకు మాంసకృత్తులు కావాల్సి ఉంటుంది. శరీరంలో ఉండే గ్రంధులు హార్మోన్లను ఉత్పత్తి చేసేందుకు ముడిసరుకుగా మాంసకృత్తులు ఉపకరిస్తాయి. ఎంజైములు, యాంటీబాడీస్ తయారీకి, కండ పుష్టికి మాంసకృత్తుల అవసరత ఉంది.

మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు మూడూ కలిపి లోపలకు వెళితే శరీరం శక్తి కొరకు పిండి, కొవ్వు పదార్థాలను వాడుకుని, శరీర నిర్మాణానికి, ఇతర పనులకు మాంసకృత్తులను ఉపయోగించుకుంటుంది. పిండి, కొవ్వు పదార్థాలు శక్తినివ్వడానికే తప్ప శరీర నిర్మాణానికి పనికిరావు. పెరిగిన బరువును చురుగ్గా తగ్గించుకోవడానికి రోజంతా మాంసకృత్తులున్నఆహారం తీసుకోవటం ఉత్తమం.

మాంసకృత్తులు జీర్ణం కావాలంటే ఎక్కువ టైము పడుతుంది. ఎక్కువ సేపు జీర్ణకోశంలో ఆహారం ఉండేసరికి మనకు ఆకలి వెంటనే వేయదు. చాలా గంటల వరకు మళ్ళీ తిండి పైకి ధ్యాసమళ్ళకుండా ఉండవచ్చు. మాంసకృత్తులున్న ఆహారం అరగడానికి ఎక్కువ టైము పట్టడం చేత, ఈ ఆహారం ద్వారా వచ్చిన సారం ప్రేగులగుండా రక్తంలోనికి మెల్ల మెల్లగా, కొద్ది కొద్దిగానే చేరుతూ ఉంటుంది.మెల్లగా చేరడం చేత రక్తంలో గ్లూకోజ్ పరిమాణం పెరగదు.

మాంసకృత్తులున్న ఆహార పదార్థాలు శాకాహారంలో ఉండవు. పిండి పదార్థాలు లేకుండా మాంసకృత్తులు మాత్రమే మాంసాహారములో ఉంటాయి. చేపలు, కోడి, రొయ్యలు వంటి వాటిలో మాంసకృత్తులు అధికంగా లభిస్తాయి.