Enjoying Day In Sweet Shop
చేయి చూడటం ద్వారానో, జాతకం చూడటం ద్వారానో ఎవరి భవిష్యత్తునైనా ఇట్టే చెప్పేస్తారు పండితులు..అయితే మనిషి ఇష్టమైన అలవాట్లను బట్టి కూడా భవిష్యత్తును చెప్పవచ్చట. మీరు ఇష్టపడే ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ను భట్టి మీరు ఎలాంటి వారో సులభంగా చెప్పవచ్చు. మీరు ఇష్టపడే ఐస్ క్రీం ఫ్లేవర్ ను బట్టీ మీరెలాంటి వారో తెలుసుకోవాలనుందా… అయితే ఆ వివరాలేంటో తెలుసుకోండి…
చాక్లెట్ ఫ్లేవర్ ను ఇష్టపడేవారు తనకు మించిన వారు లేరని బావిస్తారు. నిత్యం అందంగా, స్మార్ట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. వెనీలా ఫ్లేవర్ ను ఇష్టపడేవారు కొత్త ప్రయోగాలు చేసేందుక ఆసక్తి చూపుతారు. జీవితంలో ఏదో సాధించాలన్న తాపత్రయంతో ఉంటారు. స్టాబెర్రీ ఫ్లేవర్ ను ఇష్టపడేవారు నిత్యం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. ప్రపంచంతో సంబంధంలేకుండా తనపని తాను చేసుకుంటూ నచ్చిన నాయకుడిని అనుసరిస్తూ ఉంటారు.
కాఫీ ఫ్లేవర్ ను ఇష్టపడేవారు కొత్త పనులను మొదలు పెట్టేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. అయితే పనులను పూర్తి చేయటంలో మాత్రం అలసత్వం చూపిస్తారు. బటర్ స్కార్చ్ ను ఇష్టపడేవారు తోటి వారితో పోలిస్తే తానే ఒక్కసారైన బెస్ట్ అనిపించుకోవాలని కోరుకుంటుంటారు. కష్టపడే మనస్తతత్వాన్ని కలిగి ఉంటారు.
మింట్ చాక్లెట్ చిప్ ఫ్లేవర్ ను ఇష్టపడేవారు ఒక లక్ష్యాన్ని కలిగి ఉండటంతోపాటు, ఆర్ధిక వ్యవహారాలను చాకచక్యంగా సరిదిద్దుతారు. చాక్లెట్ చిప్ ఫ్లేవర్ ను ఇష్టపడేవారు చాలా చురుకుగా ఉండటంతోపాటు ఉదారా స్వభావాన్ని కలిగి ఉంటారు. అన్ని విషయాల్లో సమర్ధ వంతంగా పనిచేస్తారు.