Green Peas
Green Peas : పచ్చిబఠానీల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలుదాగున్నాయి. ఈ విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. చలికాలంలో మార్కెట్లో పచ్చిబఠానీ కాయలు అందుబాటులో ఉంటాయి. చలికాలంలో ఇవి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. పచ్చిబఠానీల్లో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, పాలీఫినోల్స్, విటమిన్ ఎ, సి మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు మరికొన్ని ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. బరువు తగ్గించడం నుండి బ్లడ్ షుగర్ లెవల్స్ ను క్రమబద్దం గుణాలు పచ్చిబఠానీల్లో ఉన్నాయి.
పచ్చిబఠాణీలు ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల మనకి ఎక్కువగా ఆకలి అనిపించదు. పచ్చిబఠాణీలను ఉడకబెట్టికొని మాత్రమే కాకుండా అనేక రకాలుగా కూరలు, సూప్ చేసుకొని తినటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సన్నగా నాజుగ్గా కనపడాలనుకునే వారు బఠాణీలను ఎక్కువగా తీసుకుంటే మంచిది. మలబద్దకంతో బాధపడేవారు పచ్చి బఠానీలను ఆకుకూరలు, కూరగాయలతో కలిపి తీసుకుంటే విరేచనం సాఫీగా జరిగి మలబద్దకం నుండి విముక్తి పొందవచ్చు.
వంద గ్రాముల పచ్చి బఠానీలు అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు వీటిని ఇతర కూరగాయలతో కలిపి తీసుకుంటే ఆకలి త్వరగా వేయదు. బరువు కూడా పెరగకుండా ఉంటారు. బఠానీలలో ప్రోటీన్ ఫైబర్, ఐరన్ మరియు ఏ కె, సి మొదలగు విటమిన్స్ ఉంటాయి. ప్రోటీన్ బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది . విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించటంలో ఉపయోగపడతాయి.
బఠాణీలు గ్లైసిమిక్ ఎక్కువ కలిగి ఉంటాయి. అందువలన డయాబెటిక్ రోగులు తప్పనిసరిగా బఠాణీలను తీసుకోవాలి. పచ్చి బఠానీలలో లెక్టిన్, ఫైబర్ వంటి యాంటీ న్యూట్రీయన్లు ఉంటాయి. పచ్చి బఠానీల్లో విటమిన్ ఎ, బి1, బి2, సిలతోపాటు ఐరన్, కాల్షియం, పాస్ఫరస్‌లు సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి బఠానీలను ఉడికించి ముద్దలా చేసి ఎదుగుతున్న పిల్లలకు, బలహీనంగా ఉన్న వారికి ఇస్తే బలవర్దక ఆహారంగా అందించినట్లవుతుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. రక్తనాళాలను సంరక్షిస్తాయి. విటమిన్ కె వీటిలో కావల్సినంత దొరుకుతుంది. రోజుకు 1 కప్పు పచ్చి బఠానీలను తింటే శరీరానికి నిత్యం కావల్సిన విటమిన్ కెలో అందుతుంది.
యాంటీ ఆక్సిడెంట్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అల్జీమర్స్, ఆర్థరైటిస్, బ్రాంకైటిస్, ఆస్టియోపోరోసిస్, క్యాండిడా వంటి రోగాలకు ఇవి బాగా పనిచేస్తాయి. డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి పచ్చి బఠాణీలు చక్కని ఆహారం. వీటిలో ఫైబర్ అధికంగా ఉండడంతో రక్తంలో గ్లూకోజ్ త్వరగా చేరదు. టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారికి ఇవి బాగా పనిచేస్తాయి. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి.
క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు ఉన్నాయి. రోజుకు ఒక కప్పు మోతాదులో తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధనల్లో తెలిసింది. పచ్చి బఠానీలలో ఉండే మెగ్నీషియం, పొటాషియం గుండెకు ఎంతో మేలు చేస్తాయి. బఠానీలు తినటం వల్ల బీపీని కంట్రోల్ లో ఉంచవచ్చు. అయితే రాత్రి పూట మాంసాహారం, మసాలా దినుసుల్లో వీటిని చాలా తక్కువగా తీసుకుంటే మంచిది.