Wheat Flour (1)
Wheat Flour : చపాతీలంటే ఇష్టం పడని వాళ్లు ఎవ్వరూ ఉండరు. షుగర్ వ్యాధి వచ్చిన వాళ్లు.. ఎక్కువగా చపాతీలు తినడానికే ఇష్టపడుతుంటారు. గోధుమ పిండితో చేసే వంటకాలంటే అందరికీ ఇష్టమే. ప్రస్తుత తరుణంలో చాలా మంది డైటింగ్ పేరిట రాత్రి పూట అన్నంకు బదులుగా చపాతీలను తింటున్నారు. అధిక బరువు తగ్గేందుకు, షుగర్ ఉన్నవారు చపాతీలను తినడం అలవాటుగా చేసుకున్నారు. కానీ గోధుమ పిండిని ఎక్కువగా తీసుకుంటే ఏమౌతుందో చాలామందికి తెలియదు. మనం వాడే గోధుమ పిండి గోధుమలు ముడి గోధుమలు కావు. ఇవి పొట్టుతో కూడి ఉండవు. గోధుమ పిండిలో గ్లూటెన్ అనే పదార్థం ఉంటుంది. అది శరీరంలో ఎక్కువైతే సమస్యలే. నిజానికి గోధుమ పిండిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందని అందరూ తింటారు
పూర్వం ఏ ధాన్యం వాడినా, పొట్టుతో సహా దంచి ఉపయోగించేవారు. దీంతో ఆ పొట్టులో ఉండే ఫైబర్ వల్ల ఎన్నో పోషకాలు వారికి అందేవి. దీంతో వారు ఆరోగ్యంగా ఉండేవారు. అయితే ప్రస్తుతం మనకు లభిస్తున్న అనేక ధాన్యాలు, వాటితో తయారు చేసే పిండిలో ఫైబర్ ఉండడం లేదు. కారణం.. పొట్టు లేకుండానే వాటితో పిండి తయారు చేస్తున్నారు. ఇలా గోధుమలను కూడా ఉపయోగించి పిండి తయారు చేస్తున్నారు. ఆ పిండిలో ఫైబర్ కొంచెం కూడా ఉండదు. దీని వల్ల వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు.
డైటింగ్ పేరిట బరువు తగ్గాలని , షుగర్ కంట్రోల్ కావాలని చాలా మంది రాత్రి పూట అన్నంకు బదులుగా గోధుమ పిండితో తయారు చేసిన చపాతీలను తింటున్నారు. కానీ వాస్తవానికి ఆ పిండిలో ఫైబర్ ఉండదు కనుక.. అలాంటి చపాతీలను తిన్నా వేస్ట్. పైగా అనారోగ్య సమస్యలు ఇంకా ఎక్కువవుతాయని నిపుణులు అంటున్నారు. అలాంటి ఫైబర్ లేని చపాతీలను తినడం వల్ల బరువు తగ్గరు సరికదా.. బరువు ఇంకా పెరుగుతారు. పైగా షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి. శరీరంలో కొవ్వు చేరుతుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ ఎక్కువవుతాయి.
ప్రస్తుతం మార్కెట్లలో దొరుకుతున్న గోధుమ పిండిలో ఫైబర్ తక్కువగా, గ్లూటెన్ ఎక్కువగా ఉంటోంది. దానికి కారణం.. గోధుమ పిండిని ఫ్యూరిఫై పేరుతో రిఫైన్ చేయడమే. దాని వల్ల అందులో ఉన్న ఫైబర్ తగ్గిపోతుంది. గ్లూటెన్ శాతం పెరుగుతుంది. అటువంటి గోధుమ పిండిని ఎక్కువగా తీసుకుంటే.. సీలియాక్ అనే వ్యాధి వస్తుంది. అదే క్రమంలో గోధుమ పిండిని ఎక్కువగా తీసుకుంటే కడుపు నొప్పి వస్తుంది. పేగులు బిగుసుకుపోతాయి. నీళ్లతో కూడిన విరేచనాలు అవుతాయి. గ్యాస్ సమస్య వస్తుంది. పేగుల్లో వాపు వస్తుంది. చిన్న పేగు క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.
గోధుమలపై ఉండే పొట్టుతోనే వాటిని పిండిలా పట్టించుకోవాలి. ఆ పిండితో చపాతీలను చేసుకుని తింటేనే మేలు జరుగుతుంది. అలా కాకుండా మార్కెట్‌లో మనకు లభించే పిండితో చపాతీలను చేసుకుని తింటే ఇబ్బందులు తప్పవని గమనించాలి. కనుక ముడి గోధుమలతో మనమే స్వయంగా పిండి పట్టించుకుని దాంతో చపాతీలను చేసుకుని తినడం మంచిది.