Dinner : రాత్రి భోజనం ఎప్పుడు చేయాలి! ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి?

రాత్రి భోజనం విషయానికి వస్తే, అతిగా తినడం, తినకూడని ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల నిద్రకు ఇబ్బంది కలుగుతుంది. మరోవైపు, తృప్తి చెందడం కంటే తక్కువగా ఉండే భోజనం ఎక్కువ కావాలనే కోరికను కలిగిస్తుంది. పౌష్టికాహారాన్ని తీసుకోవ‌డం శరీరానికి ఎంత అవసరమో, అలాగే ఆహారాన్ని త‌గిన స‌మ‌యానికి తీసుకోవ‌డం కూడా అంతే ముఖ్యం.

When to have dinner! What kind of foods should be taken?

Dinner : రాత్రి భోజనం, సాధ్యమైనంత పెందలాడే తినాలి. సులభంగా అరిగే పదార్థాల్ని తినాలి. భోజనానికి నిద్రకు కనీసం 3గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. రాత్రి భోజనంలో పెరుగు వాడకుండ మంచిది. మజ్జిగగాని, లేక పాలతోగాని భోజనం చేయాలి. భోజనం తరువాత కనీసం 100 అడుగులు నడిచిన తర్వాత కూర్చోవాలి. అలాకాకుండా తిన్న వెంటనే కూర్చుంటే పొట్ట పెరుగుతుంది. తిన్న వెంటనే నిద్రించేవారికి, భోజనం చేసిన వెంటనే సంభోగం చేసే వాళ్ళకి త్వరగా మృత్యువు దాపురిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

చాలామంది భోజనం తరువాత వెంటనే రకరకాల పండ్లు తింటారు. ఇది మంచి పద్దతి కాదు. పండ్లు తినాలంటే భోజనానికి గంట ముందు గాని గంట తరువాత గాని తినాలి. మనం తినే ఆహారంలో తీపి పదార్థాల వల్ల రక్తం వృద్ది, పులుపు పదార్ధాల వల్ల ఎముకలలో గుజ్జు వృద్ధి, వగరువల్ల రసధాతువృద్ధి, అన్నం వల్ల శుక్ర వృద్ధి కలుగుతుంది. కాబట్టి ఈ ఆరు రుచులున్న పదార్థాల్ని భోజనంలో వుండేలా మనం జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

రాత్రి భోజనం విషయానికి వస్తే, అతిగా తినడం, తినకూడని ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల నిద్రకు ఇబ్బంది కలుగుతుంది. మరోవైపు, తృప్తి చెందడం కంటే తక్కువగా ఉండే భోజనం ఎక్కువ కావాలనే కోరికను కలిగిస్తుంది. పౌష్టికాహారాన్ని తీసుకోవ‌డం శరీరానికి ఎంత అవసరమో, అలాగే ఆహారాన్ని త‌గిన స‌మ‌యానికి తీసుకోవ‌డం కూడా అంతే ముఖ్యం. వేళ త‌ప్పి భోజ‌నం చేస్తే మ‌న ఆరోగ్యంపై ప్ర‌భావం చూపిస్తుంది.

రాత్రి పూట త్వ‌ర‌గా భోజ‌నం చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. దీంతో స్థూల‌కాయం బారిన ప‌డ‌కుండా ఉంటారు. శరీరం మెలటోనిన్‌ను విడుదల చేయడం అన్నది నిద్రకు ఉపక్రమించబోయే ముందే జరుగుతుంది. ఈ సమయంలోనే చివరి భోజనం తినాలని నిపుణులు సూచిస్తున్నాయి. అధిక బరువు తగ్గాలనుకునే వారు రాత్రి 8గంటల లోపుగానే ఆహారం తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మనం తిన్న ఆహారం నుంచి వ‌చ్చే శ‌క్తిని ఖ‌ర్చు పెట్టేందుకు శ‌రీరానికి త‌గిన స‌మ‌యం దొరుకుతుంది.

రాత్రిపూట త్వ‌ర‌గా భోజ‌నం చేయ‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగవుతుంది. మ‌నం తిన్న ఆహారాన్ని స‌రిగ్గా జీర్ణం చేసేందుకు కావ‌ల్సినంత స‌మ‌యం ల‌భిస్తుంది. రాత్రి త్వ‌ర‌గా భోజ‌నం చేసే వారికి గుండె జ‌బ్బులు, హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు త‌క్కువ‌ని పలు అధ్యయనాల్లో తేలింది. రాత్రి త్వరగా నిద్ర ప‌ట్టాలంటే త్వ‌ర‌గానే భోజ‌నం చేయాలి.