White Onions: ఉల్లిపాయల్లో తెల్లఉల్లి ప్రత్యేకమట

ఉల్లిచేసే మేలు తల్లికూడా చేయలేదంటారు. ఎందుకంటే ప్రతికూరలో ఉల్లిపాయలేనిదే ముద్ద దిగదు మనోళ్లకి. మనదేశంలో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచే ఉల్లిపాయలు వాడుతున్నారంటే మనకి ఉల్లిగడ్డతో ఉండే రిలేషన్ ఏపాటిదో తెలిసిపోతుంది.

White Onion

 

White Onions: ఉల్లిచేసే మేలు తల్లికూడా చేయలేదంటారు. ఎందుకంటే ప్రతికూరలో ఉల్లిపాయలేనిదే ముద్ద దిగదు మనోళ్లకి. మనదేశంలో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచే ఉల్లిపాయలు వాడుతున్నారంటే మనకి ఉల్లిగడ్డతో ఉండే రిలేషన్ ఏపాటిదో తెలిసిపోతుంది. అనేక ప్రయోజనాలు అందించే ఉల్లిపాయల్లో తెల్ల ఉల్లి ప్రత్యేకం.

ఉల్లిపాయల్లో తెల్ల ఉల్లిపాయలు అరుదుగా చూస్తుంటాం. అయితే వీటిలో గుణాలు కూడా అరుదైనవే ఉన్నాయట. పొటాషియం అధికంగా ఉంటుందట. ఈ ఉల్లిపాయలు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుందట. అంతేకాకుండా హైపర్ టెన్షనల్ లక్షణాలను సైతం తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. తెల్ల ఉల్లిపాయ కంటికి కూడా మేలు చేస్తుంది.

ఐరన్ పదార్థాలు ఎక్కువగా ఉండి రక్తప్రసరణకు బాగా సహకరిస్తుంది. సోమరితనాన్ని దూరం చేసి చురుగ్గా ఉండేలా చేస్తుంది. ఫోలేట్, విటమిన్-బీ6లు ఉండటంతో ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి. అలసటగా ఉండటం, బరువు తగ్గాలనుకునేవారికి ఈ ఉల్లి చాలా మంచిది. కళ్ల నుంచి నీరు కారేవారికి మంచి పరిష్కారం దొరుకుతుంది కూడా.

Read Also: ఉల్లి కాడలతో ఆరోగ్య ప్రయోజనాలు

ఇంకా రెగ్యూలర్ గా తీసుకోవడం అలవాటుపడితే జీర్ణక్రియ కూడా మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు.