Psychiatric Patients : మానసిక రోగుల్లోనే కరోనా తీవ్రత, మరణాల ముప్పు ఎక్కువ.. ఎందుకంటే?

మానసిక అనారోగ్యంతో బాధపడేవారిలో కరోనా సోకితే.. ఆస్పత్రిలో చేరడంతో పాటు మరణించే ముప్పు అధికంగా ఉందని ఓ కొత్త అధ్యయనంలో తేలింది. మానసిక రుగ్మతలు లేని వ్యక్తులతో పోలిస్తే.. రెండు రెట్లు అధికంగా ఉందని కనుగొన్నారు.

Psychiatric Patients : మానసిక అనారోగ్యంతో బాధపడేవారిలో కరోనా సోకితే.. ఆస్పత్రిలో చేరడంతో పాటు మరణించే ముప్పు అధికంగా ఉందని ఓ కొత్త అధ్యయనంలో తేలింది. అది కూడా మానసిక రుగ్మతలు లేని వ్యక్తులతో పోలిస్తే.. మానసిక రోగుల్లో రెండు రెట్లు అధికంగా ఉందని అధ్యయనంలో కనుగొన్నారు పరిశోధకులు. యూరోపియన్ కాలేజ్ ఆఫ్ న్యూరోసైకోఫార్మాకాలజీ, ఇమ్యునో-న్యూరో సైకియాట్రీ నెట్‌వర్క్ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ఐసియూలో చేరే కేసుల్లో పెద్దగా ప్రభావం లేదని తేలింది.

ఈ పరిశోధనలో భాగంగా 22 దేశాల్లోని 33 అధ్యయనాల నుంచి డేటాను సేకరించారు. ఇందులో కరోనా బాధితులు 1,469,731 మంది ఉండగా.. వారిలో 43,938 మందికి మానసిక సమస్యలు ఉన్నాయని గుర్తించారు. కరోనా సంబంధిత మరణాలు, ఆసుపత్రిలో చేరడం, కొమొర్బిడ్ మానసిక రుగ్మతలు కలిగిన వ్యక్తులలో ICU చేరడం వంటి 23 అధ్యయనాలపై లోతుగా పరిశీలించారు. మానసిక రుగ్మతలతో బాధపడే వ్యక్తుల్లో యాంటిసైకోటిక్స్ లేదా యాంజియోలైటిక్స్ (ఆందోళన తగ్గించే మందులు)తో చికిత్స పొందుతున్న బాధితుల్లో కరోనా మరణాలు ఉన్నాయని గుర్తించారు. తీవ్రమైన మానసిక అనారోగ్యంతో బాధపడే వారికి కరోనా టీకాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

మానసిక రుగ్మతలతో బాధపడే బాధితులు అత్యధిక మరణాల ముప్పుకు ప్రభావితమయ్యారు. కానీ, ఆస్పత్రిలో చేరే ప్రమాదం లేదని గుర్తించారు. బెంజోడియాజిపైన్స్ శ్వాసకోశ సమస్యతో సంబంధం ఉందని, ఇతర సంబంధిత మరణాలతో కూడా సంబంధం ఉందని కనుగొన్నారు. అలాగే ఆహారం, శారీరక వ్యాయామం లేకపోవడం, ఒంటరితనం, జీవనశైలిలో మార్పులు, అధిక ఆల్కహాల్, పొగాకు వాడకం, నిద్రలేమి, కొమొర్బిడిటీలపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తుందని పరిశోధకులు తేల్చేశారు.

ట్రెండింగ్ వార్తలు