Silver Anklets
Silver Anklets : హిందూ సంప్రదాయాల ప్రకారం స్త్రీలు కొన్ని నగలను ధరించడం సంప్రదాయంగా వస్తోంది. అలాగే అమ్మాయిల అందాన్ని మరింత పెంచే వాటిలో కళ్లకు కాటుక, నుదిటిన బొట్టు, చేతులకు గాజులు, కాళ్లకు పట్టీలు ముఖ్యమని చెప్పవచ్చు. ఇలాంటి వాటిలో పాదాలకు పట్టీలు ధరించడం కూడా ఒకటి. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి వివిధ రకాల ఆభరణాలతో అలంకరించి ముచ్చట తీర్చుకుంటుంటారు తల్లిదండ్రులు. ముఖ్యంగా కాళ్ళకు పట్టీలు ధరించటం అన్నది ఆనవాయితీగా వస్తుంది. అయితే పాదాలకు కేవలం వెండి పట్టీలను మాత్రమే ధరిస్తారు.
ప్రస్తుత కాలంలో ఎన్నో రకాల డిజైన్లతో కూడిన పట్టీలు అందుబాటులోకి రావడం వల్ల చాలామంది వెండి పట్టీలకు బదులుగా వారికి నచ్చిన డిజైన్లలో ఉన్న పట్టీలను ధరిస్తున్నారు. బాగా డబ్బున్న వారు ప్రస్తుత కాలంలో బంగారు పట్టీలను తయారు చేయించుకుని ధరిస్తున్నారు. అయితే సంస్కృతి సంప్రదాయాల ప్రకారం బంగారు పట్టీలను ఎలాంటి పరిస్థితులలో కూడా ధరించకూడదు. బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము. కనుక బంగారు పట్టీలను పాదాలకు ధరించడం వల్ల సాక్షాత్తూ అమ్మవారిని అవమానపరిచినట్లే అవుతుందని పండితులు చెబుతున్నారు.
ఇకఆధ్యాత్మిక పరంగా మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా వెండి పట్టీలను పాదాలకు ధరించడం వల్ల మన శరీరంలో ఉన్న వేడి మొత్తం బయటకు పోయి మన శరీరం చల్లబడుతుంది. వెండి మువ్వలు ధరించడం వల్ల మహిళలు మరింత ఎనర్జిటిక్ గా ఉంటారు. రక్తప్రసరణ సజావుగా జరగడానికి, పాదాలు వాపులు రాకుండా ఉండటానికి సహకరిస్తాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తో పోరాడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పట్టీలు పెంచుతాయి.
చెప్పులు లేకుండా నేల మీద నిల్చున్నప్పుడు భూమి నుంచి కూడా కొంత ఎనర్జీ మనకి వస్తుంది. శరీరం మీద వెండి ఉండటం వల్ల ఆ ఎనర్జీ పాజిటివ్ గా ఉంటుంది. ఇంట్లో చెప్పులు లేకుండా నడిచే స్త్రీలు తప్పనిసరిగా వెండి పట్టీలు పెట్టుకోవాలి. ఎముకలు బలహీనంగా ఉన్న వారికి ఈ పాదాల నొప్పి పైవరకూ పాకుతుంది. రెగ్యులర్ గా వెండి పట్టీలు పెట్టుకోవడం వల్ల ఈ సమస్యని తగ్గించవచ్చు. గర్భవతులు తప్పనిసరిగా వెండి పట్టీలు పెట్టుకోవాలని అంటారు. దాని వల్ల ప్రసవ సమయం లో వచ్చే నొప్పి బాగా తగ్గుతుందట.
వెండికి ఉండే యాంటి-బాక్టీరియల్ ప్రాపర్టీస్ వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఆడపిల్లలు ఇంట్లో నవ్వుతూ తిరుగుతూ ఉంటె ఇల్లంతా సంతోషంగా ఉంటుందని పెద్దలుఅభిప్రాయం. ఇదిలావుంటే బంగారం మాత్రం మన శరీరానికి వేడి కలుగచేస్తుంది. కనుక ఎట్టి పరిస్థితులలోనూ పాదాలకు వెండి పట్టీలు తప్ప బంగారు పట్టీలు ధరించకూడదని.. ఆధ్యాత్మికంగాను ఆరోగ్యపరంగాను వెండి పట్టీలు శుభప్రదమని పండితులు తెలియజేస్తున్నారు.