Toe Rings : కాలికి మెట్టెలు ధరించటం వల్ల ఏంజరుగుతుందో తెలుసా?
కాలి రెండవ వేలు అడుగు బాగంలో జననాంగలకు సంబందించిన నాడీ ప్రేరక కేంద్రాలు ఉంటాయట. నడిచే సమయం లో మెట్టెలు, కాలి రెండవ వేలు మధ్య రాపిడి జరగడం వలన జననాంగలకు సంబందించిన ఈ నాడీ ఆరోగ్యవంతమై ఉత్తేజభరితమైన లైంగిక జీవితాన్ని అందిస్తాయని మరొక వాదన ఉంది.

Toe Rings
Toe Rings : హిందూ సంప్రదాయంలో మహిళల వివాహం గుర్తుగా మెట్టెలు పెట్టుకుంటారు. మన పూర్వికుల కాలం నుండి వధువుకి కాళ్ల మెట్టెలు ధరించడం సంప్రదాయంగా వస్తుంది. ఈ మెట్టలు వధువుకి వివాహిత అని చెప్పే మరో గుర్తుగా భావిస్తారు. ఇది ముఖ్యంగా కాలి రెండవ వేలుపై ధరిస్తారు సాధారణంగా మెట్టెలు వెండి ధాతువుతో తయారు చేస్తారు.
కాలి వేళ్ళకు మెట్టెలు ధరించటానికి సంబంధించి విభిన్న రకాలైన వాదనలు ఉన్నాయి. కాలి బొటనవేలు పక్కనున్న వేలు స్త్రీలకూ ఆయువు పట్టు లాంటిదని దాని నుంచి విద్యుత్ ప్రసరిస్తుంటుందని నమ్ముతారు. ఆ వేలు నేలకు తగలడం మంచిది కాదని, అలా తగలకుండా
ఉండటానికే మెట్టెలు ధరించే సంప్రదాయం అనుసరిస్తున్నారని ఒక వాదన ఉంది.
కాలి రెండవ వేలు అడుగు బాగంలో జననాంగలకు సంబందించిన నాడీ ప్రేరక కేంద్రాలు ఉంటాయట. నడిచే సమయం లో మెట్టెలు, కాలి రెండవ వేలు మధ్య రాపిడి జరగడం వలన జననాంగలకు సంబందించిన ఈ నాడీ ఆరోగ్యవంతమై ఉత్తేజభరితమైన లైంగిక జీవితాన్ని అందిస్తాయని మరొక వాదన ఉంది. అలాగే గుండె నుంచి గర్భాశయానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుందని చెప్తారు.
కొన్నిసార్లు కొందరు మహిళలు బంగారు మెట్టెలు ఉపయోగిస్తారు ఇది సంప్రదాయానికి విరుద్ధమైనదిగా భావిస్తారు. వెండి మెట్టెలు ధరిస్తే ప్రకృతిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ వారి శరీరంలోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. వెండితో చేసిన మెట్టలను ధరించటం వల్ల ఇది మంచి ఉష్ణ వాహకంగా
పనిచేస్తుంది.