Video: నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన న్యూజిలాండ్.. భారీ ఫైర్‌వర్క్స్‌

పసిఫిక్ దేశమైన కిరిబాటిలో భాగమైన కిరిటిమాటి ద్వీపం ప్రపంచంలో నూతన సంవత్సరాన్ని ముందుగా జరుపుకునే ప్రాంతం. అక్కడ కూడా న్యూఇయర్ వేడుకలు నిర్వహించారు.

Video: నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన న్యూజిలాండ్.. భారీ ఫైర్‌వర్క్స్‌

Fireworks adorn New Zealand's Auckland (Image Credit To Original Source)

Updated On : December 31, 2025 / 7:42 PM IST
  • స్కై టవర్ నుంచి పెద్ద ఎత్తున ఫైర్‌వర్క్స్‌
  • ఆస్ట్రేలియాలోని సిడ్నీలోనూ న్యూఇయర్‌ వేడుకలు
  • పలు దేశాల్లో ఇటీవల విషాదాలు
  • నూతన సంవత్సర వేడుకలపై ప్రభావం

Video: న్యూజిలాండ్ ప్రజలు నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. న్యూజిలాండ్‌లోని అత్యంత ఎత్తైన భవనం స్కై టవర్ నుంచి పెద్ద ఎత్తున ఫైర్‌వర్క్స్‌ ప్రదర్శించారు. ప్రపంచంలో నూతన సంవత్సరాన్ని ముందుగా ఆహ్వానించిన ప్రధాన నగరంగా ఆక్లాండ్‌ నిలిచింది.

ఆ నగరంలోని 17 లక్షల మంది ఫైర్‌వర్క్స్‌ను చూస్తూ హ్యాపీ న్యూఇయర్ చెప్పుకున్నారు. వర్షం, పిడుగులు పడే అవకాశం ఉందన్న అంచనాల కారణంగా నార్త్ ఐలాండ్‌లో చాలా చోట్ల న్యూఇయర్‌ ప్రోగ్రామ్‌లను రద్దు చేశారు.

మరోవైపు, ఆస్ట్రేలియా(Australia)లోని అతిపెద్ద నగరమైన సిడ్నీలోనూ న్యూఇయర్‌ వేడుకలు జరుపుకుంటున్నారు. సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్‌పై ఫైర్‌వర్క్స్ వీక్షించేందుకు నగర కేంద్ర జలతీరం వద్దకు వేలాది మంది చేరుకున్నారు.

Also Read: కదులుతున్న కారులో 2 గంటల పాటు యువతిపై దారుణం.. 90 కి.మీ వేగంతో వెళ్తూ చివరకు బయటకు తోసేసి..

న్యూఇయర్‌ జరుపుకున్న తొలి దేశం కిరిబాటి
పసిఫిక్ దేశమైన కిరిబాటిలోని భాగమైన కిరిటిమాటి ద్వీపం ప్రపంచంలో నూతన సంవత్సరాన్ని ముందుగా జరుపుకునే ప్రాంతం. యూటీసీ+14 టైమ్ జోన్‌లో ఉన్న ఈ ద్వీపం క్రిస్మస్ ఐలాండ్ పేరుతో కూడా ప్రసిద్ధి.

ఇండొనేషియాలో గత నెల సుమాత్రాలో సంభవించిన వరదల వల్ల 1,100 మందికికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో నూతన సంవత్సర ప్రోగ్రాంలను ఈ సారి భారీ స్థాయిలో నిర్వహించడం లేదు.

బాలి దీవిలో ఫైర్‌వర్క్స్ ప్రదర్శనలు రద్దు చేశారు. దానికి బదులుగా సంప్రదాయ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

హాంకాంగ్‌లోని అపార్ట్‌మెంట్లలో నవంబరులో ఘోర అగ్నిప్రమాదం జరిగి 161 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో విక్టోరియా హార్బర్‌పై సాధారణ ఫైర్‌వర్క్స్‌కు బదులుగా సెంట్రల్ ప్రాంతంలో సంగీత కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

టోక్యోలో అర్ధరాత్రి గంట మోగింపునకు బౌద్ధ ఆలయం వద్దకు ప్రజలు భారీగా చేరుకున్నారు. సియోల్‌లో దక్షిణ కొరియన్లు బోసింగాక్ పావిలియన్ వద్ద గంట మోగింపు, కౌంట్‌డౌన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.