Best Bluetooth Speakers : 2026 న్యూ ఇయర్ హౌస్ పార్టీకి రెడీనా? రూ. 10వేల లోపు 5 బెస్ట్ బ్లూటూత్ స్పీకర్లు మీకోసం

Best Bluetooth Speakers : రూ.10వేల లోపు ధరలో 5 అత్యుత్తమ బ్లూటూత్ స్పీకర్లను మీకోసం అందిస్తున్నాం. ఈ స్పీకర్లలో పవర్‌ఫుల్ ఆడియో, లాంగ్ బ్యాటరీ లైఫ్, మల్టీఫేస్ కనెక్టివిటీని అందిస్తాయి.

Best Bluetooth Speakers : 2026 న్యూ ఇయర్ హౌస్ పార్టీకి రెడీనా? రూ. 10వేల లోపు 5 బెస్ట్ బ్లూటూత్ స్పీకర్లు మీకోసం

Best Bluetooth Speakers (Image Credit to Original Source)

Updated On : December 31, 2025 / 6:05 PM IST
  • న్యూ ఇయర్ పార్టీ 2026 కోసం అద్భుతమైన స్పీకర్లు
  • సౌండ్ అవుట్‌పుట్, బ్యాటరీ లైఫ్, మల్టీఫేస్ కనెక్టివిటీ ఆప్షన్లు
  • 50శాతం వాల్యూమ్‌లో దాదాపు 7 గంటల ప్లేబ్యాక్ టైమ్
  • రూ.10వేల లోపు ధరలో 5 బెస్ట్ బ్లూటూత్ స్పీకర్లు

Best Bluetooth Speakers :2026 కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. న్యూ ఇయర్ సందర్భంగా చాలామంది నైట్ పార్టీ చేసుకుంటారు. సాధారణంగా న్యూ ఇయర్ పార్టీల్లో మ్యూజిక్ సౌండ్ అనేది అత్యంత ఆకర్షణగా ఉంటుంది. లౌడ్ స్పీకర్లతో కొత్త ఏడాది వేడుకలను జరుపుకుంటారు. పెద్దగా ఖర్చు లేకుండా పవర్‌ఫుల్ సౌండ్ అందించే సరసమైన స్పీకర్ తప్పనిసరి ఉండాలి.

మీ ఇంటి పార్టీ కోసం కొనుగోలు చేసేందుకు రూ. 10వేల లోపు 5 అత్యుత్తమ బ్లూటూత్ స్పీకర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ లైనప్‌లో జీబ్రానిక్స్ థంబ్ 700, బోట్ పార్టీపాల్ 60, పోర్టానిక్స్ హార్మోనీ II, జేబీఎల్ ఫ్లిప్ 6, ఫిలిప్స్ SPA8000B/94 ఉన్నాయి. ఈ స్పీకర్లు ఆకట్టుకునే సౌండ్ అవుట్‌పుట్, బ్యాటరీ లైఫ్, మల్టీఫేస్ కనెక్టివిటీ ఆప్షన్లతో వస్తాయి. పార్టీ ఔత్సాహికులకు బడ్జెట్‌లో క్వాలిటీ సౌండ్ కోరుకునే ఎవరికైనా అద్భుతమైన ఆప్షన్లుగా చెప్పవచ్చు.

జీబ్రానిక్స్ థంప్ 700 (రూ. 8,999) :
జీబ్రోనిక్స్ థంప్ 700 పవర్‌ఫుల్ 120W అవుట్‌పుట్‌, డ్యూయల్ 25.4 సెం.మీ ఫుల్-రేంజ్ డ్రైవర్లు 2.54 సెం.మీ ట్వీటర్‌తో కలిగి ఉంది. బ్లూటూత్ v5.0తో అమర్చి ఎల్ఈడీ లైట్లు ఆఫ్‌తో 50శాతం వాల్యూమ్‌లో దాదాపు 7 గంటల ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది.

ఫీచర్ల పరంగా స్పీకర్‌లో డ్యూయల్ వైర్‌లెస్ మైక్‌లు, కంట్రోల్ స్విచ్‌తో ఆర్జీబీ లైట్లు, టీడబ్ల్యూఎస్ ఫంక్షన్ ఉన్నాయి. అదే సమయంలో మల్టీఫేస్ కనెక్టివిటీ కోసం USB, మైక్రో SD, ఎఫ్ఎమ్ రేడియో, ఏయూఎక్స్ ఇన్‌పుట్‌కు సపోర్టు ఇస్తుంది.

బోట్ పార్టీపాల్ 60 (రూ. 4,999) :

బోట్ పార్టీపాల్ (boAt PartyPal) 60 డ్యూయల్ 10.16 సెం.మీ ఫుల్-రేంజ్ డ్రైవర్లతో 20W ఆర్ఎంఎస్ సౌండ్‌ను అందిస్తుంది. 2200mAh బ్యాటరీతో 80శాతం వాల్యూమ్‌లో 4 గంటల వరకు ప్లేటైమ్‌ను అందిస్తుంది.

Best Bluetooth Speakers

Best Bluetooth Speakers  (Image Credit to Original Source)

కనెక్టివిటీకి సంబంధించి.. స్పీకర్ 10m రేంజ్‌తో బ్లూటూత్ v5.0ని కలిగి ఉంది. ఎఫ్ఎమ్ రేడియో, టీఎఫ్ కార్డ్, USB, AUX మోడ్‌లతో పాటు ఇంటిగ్రేటెడ్ కరోకే ఫీచర్ కలిగి ఉంది. రెండు స్పీకర్‌లను కనెక్ట్ చేసేందుకు రియల్ వైర్‌లెస్ పెయిర్ వంటి సపోర్టు ఇస్తుంది.

Read Also : Samsung Galaxy S24 5G : భలే ఆఫర్ బ్రో.. ఈ శాంసంగ్ గెలాక్సీ S24 5Gపై అద్భుతమైన డిస్కౌంట్, అమెజాన్ ఆఫర్ ఇదిగో

పోర్ట్రోనిక్స్ హార్మొనీ II (రూ. 5,999) :
పోర్ట్రోనిక్స్ హార్మొనీ II బ్లూటూత్ 5.3 కనెక్టివిటీతో పవర్‌ఫుల్ 60W సౌండ్ అవుట్‌పుట్‌ కలిగి ఉంది. 5000mAh బ్యాటరీతో టాప్ వాల్యూమ్‌లో దాదాపు 5 గంటల ప్లేటైమ్‌ అందిస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే.. స్పీకర్ USB, AUX కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది. మల్టీఫేస్ కోసం గోల్డ్, గ్రే కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.

జేబీఎల్ ఫ్లిప్ 6 (రూ. 7,499) :

జేబీఎల్ ఫ్లిప్ 6 డివైజ్ 63Hz నుంచి 20kHz వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ రేంజ్‌తో 30W అవుట్‌పుట్ పవర్ అందిస్తుంది. బ్లూటూత్ 5.1 కనెక్టివిటీతో కేవలం 2.5 గంటల ఛార్జింగ్ సమయంతో 12 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. స్పీకర్ IP67 వాటర్‌ప్రూఫ్ రేటింగ్ మల్టీ స్పీకర్‌లతో జేబీఎల్ పార్టీబూస్ట్ ఫంక్షన్‌ కలిగి ఉంది.

ఫిలిప్స్ SPA8000B/94 (రూ. 9,382) :
ఫిలిప్స్ SPA8000B/94 పవర్‌ఫుల్ 120W టోటల్ అవుట్‌పుట్‌ 5.1 సరౌండ్ సౌండ్‌తో కలిగి ఉంది. అద్భుతమైన ఆడియో ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. 8-అంగుళాల హై-ఎఫిషియెన్సీ సబ్‌ వూఫర్, ఐదు 3-అంగుళాల ఫుల్-రేంజ్ శాటిలైట్ స్పీకర్‌లతో ఆధారితమైన 20Hz నుంచి 20kHz వరకు ఫ్రీక్వెన్సీ రేంజ్ అందిస్తుంది. ఈ సిస్టమ్ బ్లూటూత్ కనెక్టివిటీ, USB, SD కార్డ్ స్లాట్‌లు, ఎఫ్ఎమ్ రేడియో సపోర్ట్, ఆపరేషన్ కోసం రిమోట్ కంట్రోల్‌తో వస్తుంది.