Betel Leafs : బరువు తగ్గించుకోవాలనుకుంటే తమలపాకులతో!.

అధిక బరువు శారీరక రోగాలకు దారి తీస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు కడుపు మాడ్చుకోకుండానే తమలపాకులతో బరువు నియంత్రించుకోవచ్చు.

Betel Leafs : భోజనం చేసిన తర్వాత తమలపాకులు తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. తమలపాకుల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో సుగుణాలు తమలపాకుల్లో చాలా ఉన్నాయి. విటమిన్‌ సీ అధికంగా కలిగి ఉండే తమలపాకులు తింటే రోగనిరోధక శక్తి పెంపొందించుకోవచ్చు. ఇందులో ఉన్న యాంటీ-ఆక్సిడెంట్స్ వల్ల వీటిని ఖాళీ కడుపుతో తీసుకుంటే మలబద్ధకానికి విరుగుడుగా పనిచేస్తుంది. కాల్షియం లోపం ఉన్నవాళ్లు తమలపాకుల్లో సున్నం కలిపి తింటే మేలు.

దగ్గు, ఆయాసంతో బాధపడతున్న పిల్లలకు తమలపాకులను ఆవనూనెలో నానపెట్టి కొద్దిగా వేడిచేసి చాతీపై రుద్దాలి. ఇలా చేస్తే వారికి ఉపశమనం కలుగుతుంది. అజీర్తి చేసినపుడు తమలపాకులు నమిలితే అరుగుదల పెరుగుతుంది. వెన్ను నొప్పితో బాధపడుతున్న వాళ్లు… కొబ్బరినూనెలో తమలపాకుల రసాన్ని కలిపి వీపు వెనుక భాగంలో రాసుకోవాలి. తరచూ ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చెవి పోటుతో కలిగే బాధ వర్ణనాతీతం. కొన్ని చుక్కల తమలపాకుల రసాన్ని చెవిలో పిండితే చెవిపోటు నుంచి ఉపశమనం పొందవచ్చు.

కాన్సర్‌ నిరోధక కారకంగానూ తమలపాకు పనిచేస్తుంది. విటమిన్-సీ, థియామిన్, రైబోఫ్లోవిన్, కేరోటిన్ లాంటి విటమిన్లు తమలపాకుల్లో పుష్కలంగా ఉన్నాయి. వీటిలో ఫ్లేవనాయిడ్లు, టానిన్లు, ఆల్కలాయిడ్లు, స్టెరాయిడ్లు, క్వినోన్లు ఉన్నాయి. సాంప్రదాయ వైద్యంలో పురాతన కాలం నుండి తమలపాకులను వినియోగిస్తున్నారు. తమలపాకుల్లో యాంటీ మైక్రోబియల్ క్యాన్సర్ నిరోధక, డయాబెటిక్ వ్యతిరేక లక్షణాలు ఉన్నాయి. కార్డియో వాస్కులర్ డిసీజ్, అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు నివారణలో తమలపాకు తోడ్పడుతుందని పలు అధ్యయనాల్లో తేలింది.

అధిక బరువు శారీరక రోగాలకు దారి తీస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు కడుపు మాడ్చుకోకుండానే తమలపాకులతో బరువు నియంత్రించుకోవచ్చు. రోజూ రెండు నెలలపాటు ఒక తమలపాకును పది గ్రాముల మిరియాల గింజలను కలిపి తిని వెంటనే చన్నీళ్లు తాగుతుంటే స్థూలకాయులు సన్నగా నాజూగ్గా తయారవుతారుట. అధిక వరువును తగ్గించడానికి దివ్య ఔషదంలా పనిచేస్తోంది. తమలపాకులు కడుపు ఉబ్బరం లక్షణాలు, జీర్ణక్రియ చికిత్సలో సహాయపడతాయి. ఎలాంటి కసరత్తులు చేయకుండా కొవ్వుని తగ్గించవచ్చు. తమలపాకు రసంలో బెర్రీ , తేనె మిక్స్ చేసి తీసుకుంటే దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది. దగ్గు, కఫం, శ్వాస సంబంధిత జబ్బులకు తమలపాకు రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.

ట్రెండింగ్ వార్తలు