International Friendship Day 2023 : స్నేహాన్ని సెలబ్రేట్ చేసుకోండి.. స్నేహితుల చెయ్యి వదిలిపెట్టకండి

జీవితంలో ఓడిపోతామనే భయం వేసినపుడు ఓ ధైర్యం.. కన్నీరు పెట్టుకున్నప్పుడు ఓదార్పు.. కష్టాల్లో వెన్నంటి ఉండే తోడు.. స్నేహం మాత్రమే. మన జీవితానికో గమ్యాన్ని చూపించిన, వెన్ను తట్టి ప్రోత్సహించిన స్నేహితులను గుర్తు చేసుకోవాలి. అభినందించాలి.. దానికో ప్రత్యేక సందర్భం 'అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం' .

International Friendship Day 2023

International Friendship Day 2023 : రెండు మనసుల్ని కలిపే తీయని బంధం స్నేహం. కష్ట, సుఖాల్లో వెన్నంటి ఉండే ధైర్యం స్నేహం. జీవితానికి ఓ గమ్యం చూపేది స్నేహం. స్నేహితులతో ఉంటే రోజూ సెలబ్రేషనే. కానీ ప్రత్యేకంగా ఓ రోజు ఉంది. అదే ‘అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం’. భారతదేశంతో పాటు బంగ్లాదేశ్, యుఎఇ, మలేషియా, యుఎస్‌లలో ఏటా ఆగస్టు నెల మొదటి ఆదివారం జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 6 ‘అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం’ జరుపుకుంటున్నారు.

Friendship Band : ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కొంటున్నారా? ఏ రంగు దేనికి సంకేతమో తెలుసా?

ఇంటర్నేషనల్ ఫ్రెండ్ షిప్ డే 20 వ శతాబ్దం ప్రారంభం నుంచి నిర్వహిస్తున్నారు. హాల్ మార్క్ కార్డ్స్ ఫౌండర్ జాయిస్ హాల్ 1919 లో ఈ కాన్సెప్ట్‌ను మొదటిసారి ప్రతిపాదించారు. 1958లో మొదటిసారి ఫ్రెండ్ షిప్ డే నిర్వహించారు. దీనిని ఇంటర్నేషనల్ ఫ్రెండ్ షిప్ డేగా పరాగ్వేలో ప్రతిపాదన చేశారు. ఐక్యరాజ్యసమితి జూలై 30న అధికారిక అంతర్జాతీయ స్నేహ దినోత్సవంగా ప్రకటించింది. అయితే భారతదేశంలో ఆగస్టు నెల మొదటి ఆదివారం నాడు జరుపుకుంటారు. స్నేహానికి చిహ్నంగా పసుపు రంగును పరిగణనలోకి తీసుకుంటారు. కులం, మతం, జాతి, రంగు అనే తేడాలు లేకుండా ఈ వేడుకను జరుపుకోవడం ముఖ్య ఉద్దేశం.

 

భిన్నమైన కమ్యూనిటీలు, సంస్కృతుల మధ్య ఐక్యత, అవగాహన, శాంతిని పెంపొందించేందుకు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం ఒక ప్రత్యేక సందర్భం. ఎన్నో సవాళ్లను ఎదుర్కుంటున్న ఈ ప్రపంచంలో బంధాలను బలోపేతం చేసుకోవడానికి, సంఘీభావం పెంపొందించుకోవడానికి అన్ని వర్గాల ప్రజలు కలిసి రావడంతో ఈ దినోత్సవానికి ప్రాముఖ్యత పెరిగింది. ఈ దినోత్సవం మన ప్రాణ స్నేహితులు వారు మన జీవితాలపై చూపే ప్రభావాన్ని గుర్తు చేస్తుంది. మన పక్కన స్నేహితులు ఉంటే తిరుగులేని బలాన్ని పొందవచ్చు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనవచ్చు.

Female-Male Friendships : ఆడవారు, మగవారు నిజంగా మంచి స్నేహితులుగా ఉండగలరా?

మన జీవితాలను సుసంపన్నం చేయడానికి స్నేహం ఎలా దోహదపడిందో గుర్తించడానికి ఈ దినోత్సవం ఎంతగానో అవకాశాన్ని ఇస్తుంది. ఒకరి పట్ల ఒకరికి ధైర్యం, సానుభూతి, కరుణతో జీవితంలో ఎంత దూరమైన ప్రయాణం చేయగల శక్తి సామర్థ్యాలను ఇస్తుంది స్నేహం మాత్రమే. ఈరోజు మీ జీవితాన్ని ప్రభావితం చేసిన స్నేహితుల్ని కలవండి. వారికి కృతజ్ఞతలు చెప్పండి. బహుమతులు ఇచ్చుకోండి. మీ తీయని జ్ఞాపకాలను గుర్తు చేసుకోండి.

ట్రెండింగ్ వార్తలు