World Mental Health Day 2023 : మనసు బాగా లేదా?.. ఇలా యాక్టివ్ అవ్వండి

మనసు బాగుంటేనే యాక్టివ్‌గా ఉంటాం. ఏ పని అయినా ఉత్సాహంగా చేయగలుగుతాం. మరి మనసు బాగోని పరిస్థితుల్ని ఎలా సరిచేసుకోవాలి? ఈరోజు 'ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం'.. అసలు దీని ప్రాముఖ్యత ఏంటి?

World Mental Health Day 2023

World Mental Health Day 2023 : వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం (WHO) ప్రతి ఎనిమిది మందిలో ఒకరు మానసిక ఆరోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్నారట. మరీ ముఖ్యంగా మైనర్లు, యువతలో ఈ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఏటా అక్టోబర్ 10 న ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ (World Mental Health Day) నిర్వహిస్తారు. ఈ దినోత్సవం నిర్వహించడం వెనుక కారణాలు ఉన్నాయి.

శారీరక ఆరోగ్యానికి ఎలాంటి ప్రాముఖ్యతను ఇస్తామో.. మానసిక ఆరోగ్యానికి అలాగే ప్రాధాన్యత ఇవ్వాలి. మనసుకి సంతోషాన్ని ఇచ్చే పనులపై శ్రద్ధ పెట్టాలి. ఇటీవల కాలంలో చాలామంది అనేక మానసిక సమస్యలు ఎదుర్కుంటున్నారు. అలాంటి పరిస్థితులపై అవగాహన కల్పించడానికి ‘వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెంటల్ హెల్త్’ (WFMH) 1990 నుంచి అధికారికంగా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ నిర్వహిస్తోంది.

Impact of Social Media on Students : సోషల్ మీడియా విద్యార్ధుల మానసిక పరిస్థితిని దెబ్బ తీస్తోందట.. వాస్తవలు వెల్లడించిన సర్వే

మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే మన జీవన శైలి మార్చుకోవాలి. రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం మనసుకి ఉల్లాసాన్ని ఇస్తుంది. పచ్చని ప్రకృతిలో కాసేపు వాకింగ్ చేయడం, నచ్చిన పాటలు వినడం, డ్యాన్స్ చేయడం వంటివి కూడా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇష్టమైన ఫుడ్ తీసుకున్నా మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే పోషకాలు ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ధూమపానం, మద్యం వంటి చెడు అలవాట్లుకు దూరంగా ఉండాలి.

మానసిక ఆరోగ్యానికి సరైన సమయంలో నిద్ర చాలా అవసరం. ప్రతి రోజు నిద్ర విషయంలో టైమ్ టేబుల్ పాటించాలి. ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రభావంతో చాలామంది తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. స్క్రీన్ టైం తగ్గించి ఫోన్‌కి దూరంగా ఉండటం.. లేదంటే సోషల్ మీడియా నుంచి అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోవడం చాలా అవసరం. బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌‌లు మనసు ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి. దీని ద్వారా ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనగలిగే సామర్థ్యం కలిగి ఉంటారు.

friendship day 2023 : నిజమైన స్నేహితులు ఎలా ఉండాలో చెప్పిన మానసిక తత్వవేత్త .. మీరు అలా ఉన్నారా..?

ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్‌తో సమయం గడపడం వల్ల మానసిక ఆరోగ్యం బాగుంటుంది. మీ అనుభవాలను వారితో పంచుకోవడం .. ఇబ్బందులను షేర్ చేసుకోవడం కూడా ప్రశాంతతను ఇస్తుంది. మీ లక్ష్యాలను చిన్నవిగా విభజించుకోండి. మీ విజయాలను సెలబ్రేట్ చేసుకోండి. మరీ తప్పనిసరి పరిస్థితుల్లో మానసిక నిపుణుల సలహా తీసుకోవడంలో వెనుకడుగు వేయకండి. కౌన్సెలింగ్ వంటివి మంచి ఫలితాలను ఇస్తాయి. ఒత్తిడిని తగ్గించుకోవడం.. పాజిటివ్‌గా ఆలోచించడం.. సహనంగా ఉండటం.. మంచి మ్యూజిక్ వినడం ఇవన్నీ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఈరోజు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అనేక సంస్థలు అవగాహన కల్పిస్తాయి. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాయి.

ట్రెండింగ్ వార్తలు