World Obesity Day 2022: ఒబెసిటీ దినోత్సవం.. ఈ రోజు ప్రత్యేకత తెలుసా..

వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిలో కనిపించే కామన్ సమస్య ఒబెసిటీ. ఏటా మార్చి 4న ఒబెసిటీ డేగా గుర్తుంచుకుంటాం. ఈ రోజున దానిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టి దాని గురించి అందరికీ..

World Obesity Day 2022: ఒబెసిటీ దినోత్సవం.. ఈ రోజు ప్రత్యేకత తెలుసా..

Obesity Subhan 10tv

Updated On : March 4, 2022 / 3:43 PM IST

World Obesity Day 2022: వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిలో కనిపించే కామన్ సమస్య ఒబెసిటీ. ఏటా మార్చి 4న ఒబెసిటీ డేగా గుర్తుంచుకుంటాం. ఈ రోజున దానిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టి దాని గురించి అందరికీ తెలియజేసి బాడీ షేమింగ్ లాంటి వంటి వాటికి పోకూడదని సూచిస్తుంటారు. దాంతో పాటే ప్రతి ఒక్కరూ ఈ ఒబెసిటీతో పోరాడాలనే సంగతి గుర్తుచేస్తుంటారు.

వరల్డ్ ఒబెసిటీ రోజున వరల్డ్ ఒబెసిటీ ఫెడరేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సహకారంతో ప్రపంచవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తుంటుంది. 1975 నుంచి ఈ ఒబెసిటీ మూడింతలు పెరిగి పిల్లలతో పాటు అన్ని వయస్సుల వారినీ ఇబ్బందిపెడుతుంది. డెవలప్ అయిన దేశాలు, డెవలప్ అవుతున్న దేశాల్లోనూ ఈ మార్పులు గమనించొచ్చు.

ఇది కేవలం ఫిజికల్ సమస్యలనే కాదు, మానసిక సమస్యలకు కూడా కారణమవ్వొచ్చు. అంటే ఇది కామన్ సమస్య అయిపోయి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయమైపోయింది.

వరల్డ్ ఒబెసిటీ డే 2022
వరల్డ్ ఒబెసిటీ డేను మార్చి 4న ఏటా జరుపుకుంటాం. గతంలో అక్టోబర్ 11న జరుపుకునే రోజును మార్చి 4కు మార్చారు.

వరల్డ్ ఒబెసిటీ డే 2022 థీమ్
దీని ముఖ్యఉద్దేశ్యం ఏంటంటే.. ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాలి.

Read Also: ఒబెసిటీ ఉన్న వాళ్లకు ఫైజర్ వ్యాక్సిన్ పనిచేయదు!!

వరల్డ్ ఒబెసిటీ డే 2022 హిస్టరీ
నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వరల్డ్ ఒబెసిటీ ఫెడరేషన్… WHO, లాన్సెట్ కమిషన్ తో కలిసి అవగాహనను పెంచేలా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. 2016 తర్వాత ఫోకస్ అంతా బాల్యంలో ఒబెసిటీ గురించి డైవర్ట్ అయింది. 2017లో ఒబెసిటీకి ఇప్పుడు ట్రీట్మెంట్ చేసుకోవండి తర్వాతి పరిణామాల నుంచి కాపాడుకోండని నిర్వహించారు.

ఈ రోజు ప్రత్యేకత
ఒబెసిటీ అనేది చాలా కీలక సమస్య.. ప్రపంచ వ్యాప్తంగా 800మంది కంటే ఎక్కువ మంది దీంతో బాధపడుతున్నారు. ఎక్కువ బరువుతో ఉండటంతో లివర్, కిడ్నీలపై చాలా ప్రభావం కనిపిస్తూ ఉంది. ముందుగానే దీనిపై అవగాహన పెంచుకుంటే అధిక బరువు నుంచి తప్పించుకోవచ్చు.

ఈ రోజు అవగాహన కార్యక్రమాల్లో భాగంగా హెల్తీ లైఫ్ స్టైల్ లో ఉండే.. న్యూట్రిషన్ ఫుడ్ ఎంత ముఖ్యమో వివరిస్తారు. ఫలితంగా టైప్2 డయాబెటిస్, కార్డియో వ్యాస్క్యూలర్ డిసీజ్, హైపర్ టెన్షన్, స్ట్రోక్ లాంటివి రాకుండా చూసుకోగలం.