Love You Raa : హారర్ లవ్ కామెడీ సినిమా ‘లవ్ యూ రా’ రిలీజ్ ఎప్పుడంటే..

తాజాగా హారర్ లవ్ కామెడీ లవ్ యూ రా ఈ సినిమా ఈవెంట్ నిర్వహించి అన్ని పాటలను రిలీజ్ చేసారు. రిలీజ్ ఎప్పుడంటే..(Love You Raa)

Love You Raa : హారర్ లవ్ కామెడీ సినిమా ‘లవ్ యూ రా’ రిలీజ్ ఎప్పుడంటే..

Love You Raa

Updated On : August 19, 2025 / 2:52 PM IST

Love You Raa : సముద్రాల సినీ క్రియేషన్స్ బ్యానర్ పై చిన్ను, గీతికా రతన్ జంటగా సముద్రాల మంత్రయ్య బాబు, కొన్నిపాటి శ్రీనాథ్ ప్రజాపతి నిర్మాణంలో ప్రసాద్ ఏలూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘లవ్ యూ రా’. తాజాగా ఈ సినిమా ఈవెంట్ నిర్వహించి అన్ని పాటలను రిలీజ్ చేసారు. అలాగే సినిమాని సెప్టెంబర్ 5న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

ఈ ఈవెంట్లో హీరో చిన్ను మాట్లాడుతూ.. ఇది నా మొదటి సినిమా. ప్రసాద్ గారు నన్ను నమ్మి ఈ పాత్ర ఇచ్చారు. ఈ సినిమా అందర్నీ నవ్విస్తుంది. మా సినిమాలో హారర్, కామెడీ, లవ్ ఇలా అన్ని ఉంటాయి అని అన్నారు. నిర్మాత శ్రీనాథ్ ప్రజాపతి మాట్లాడుతూ.. ఈ సినిమా అవుట్ పుట్ నేను చూశాను. నాకు చాలా నచ్చింది. కొత్త వాళ్లు ఈ మూవీని చేసినట్టుగా అనిపించదు నేచర్‌లో తీసిన నేచురల్ మూవీ అని అన్నారు.

Also Read : Thama Teaser : ర‌ష్మిక ఫ‌స్ట్ హార‌ర్ సినిమా.. ‘థామా’ టీజ‌ర్ వ‌చ్చేసింది..

డైరెక్టర్ ప్రసాద్ ఏలూరి మాట్లాడుతూ..మా సినిమాని చూసి మెచ్చుకొని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న దయానంద్ గారికి ధన్యవాదాలు. సెప్టెంబర్ 5న మా సినిమా రాబోతోంది. నాకు రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా స్పూర్తి అని తెలిపాడు. దర్శక, నిర్మాత నాగేష్ మాట్లాడుతూ.. ప్రసాద్ ఈ సినిమాని అద్భుతంగా తీశారు. సినిమాలో దమ్ముంటే అది చిన్నదా? పెద్దదా? అని ఆడియెన్స్ పట్టించుకోరు. లవ్ యూ రా టైటిల్ చాలా క్యాచీగా ఉంది. ఈ సినిమాకి మంచి థియేటర్లు దక్కేలా చూడాలి అని అన్నారు.