Thama Teaser : రష్మిక ఫస్ట్ హారర్ సినిమా.. ‘థామా’ టీజర్ వచ్చేసింది..
రష్మిక, ఆయుష్మాన్ ఖురానాతో కలిసి నటిస్తున్న చిత్రం థామా. తాజాగా ఈ చిత్ర టీజర్ (Thama Teaser) విడుదలైంది.

Rashmika Thama Teaser out now
Thama Teaser : ఇటు టాలీవుడ్‌తో పాటు అటు బాలీవుడ్‌లోనూ వరుస చిత్రాలతో నటిస్తూ అలరిస్తోంది కథానాయిక రష్మిక.
ఆమె ఆయుష్మాన్ ఖురానాతో కలిసి నటిస్తున్న చిత్రం థామా(Thama). హారర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఈ మూవీలో ఆయుష్మాన్ ఖురానా అలోక్‌గా కనిపించనుండగా.. రష్మిక తడకా పాత్ర పోషిస్తోంది. నవాజుద్దీన్ సిద్ధిఖీ యక్షసాన్‌గా, పరేశ్ రావల్ రామ్ బజాజ్ గోయెల్‌గా నటిస్తున్నారు.
OG : ఓజీ నుంచి రొమాంటిక్ సాంగ్..? ఎప్పుడో తెలుసా?
ఆతీంద్రియ శక్తులతో కూడిన ఓ రొమాంటిక్ చిత్రంగా రూపొందుతోంది. దీపావళి 2025 కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. అందులో భాగంగా ఈ చిత్ర టీజర్(Thama Teaser)ను విడుదల చేసింది.