Potato :
Potato : బంగాళ దుంపలు వీటినే ఆలుగడ్డలు, పొటాలో అని పిలుస్తారు. ఈ దుంపలలో పిండి పదార్ధాలు అధికంగా ఉంటాయి. వీటితోపాటుగా విటమిన్ ఎ, బి, ఆలక్కాలిన్ సాల్ట్స్, ప్రొటీన్స్, పొటాష్ , ఖనిజలవణాలు, మాంసకృత్తులు కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ ఉంటాయి. శరీరానికి శక్తిని అందించే ఉత్తమ వనరులలో ఒకటి. బంగాళాదుంపలు గ్లూటెన్ రహిత స్వభావం కలిగి ఉంటాయి.
బంగాళాదుంపను ఆహారంలో చేర్చుకోవటం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుందని జంతు ఆధారిత అధ్యయనాలు చెబుతున్నాయి. ఊపిరితిత్తుల వాపును సమర్థవంతంగా తగ్గించటంలోనూ ఇది సహాయపడుతుంది. రొమ్ము క్యాన్సర్ కణాల వ్యాప్తిని నిరోధిస్తుంది. దీర్ఘకాలిక గుండె జబ్బులు మరియు మధుమేహం వంటి ఫ్రీ రాడికల్స్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి సహాయపడతాయి.
బంగాళ దుపంలను ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు ;
1. 100 గ్రా పచ్చి బంగాళ దుంపలను చిన్నచిన్న ముక్కలుగా తరిగి మెత్తిని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్టును కాలిన గాయాలపై అప్లై చేయాలి. ఇలా చేయటం వల్ల గాయాలు త్వరగా మానిపోతాయి.
2. ఎసిడిటి, కడుపులో మంటతో బాధపడేవారు పచ్చి బంగాళ దుంపలను మెత్తగా రుబ్బుకుని గుడ్డలో వేసి రసం పిండుకోవాలి. దీనిని ఒక కప్పు మోతాదులో రెండు పూటలా తాగితే ఎసిడిటి , కడుపులో మంట తగ్గుతుంది. అలాగే నీళ్లల్లో బంగాళ దుంపలు ఉడికించి ఉప్పు కలపకుండా రెండు వారాలపాటు తీసుకుంటే ఎసిడిటి, కడుపు మంట తగ్గుముఖం పడుతుంది.
3. పచ్చి బంగాళ దుంపలను మెత్తగా రుబ్బి నీళ్లలో వేసి మరగిస్తే పేస్ట్ లా తయారవుతుంది. దీనిని ముఖానికి రాసుకుంటే ముడతలు తొలగిపోతాయి.
4. బంగాళ దుంపల గుజ్జును ముఖానికి రాసుకుంటే వయస్సుతో వచ్చే మొటిమలకు సంబంధించి మచ్చలు తొలగిపోతాయి.
5. బంగాళ దుంపల రసాన్ని తీసి దానిని తాగుతుంటే జీర్ణ సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి. బంగాళాదుంపలలో కార్బోహైడ్రేట్ల మంచి మూలం కావడంతో పాటు, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నాసికా చిగుళ్ళ నుండి రక్తం కారటం, పెదవులు పగలటం, శరీరంపై దద్దుర్లు వంటి లోపాలను నివారించవచ్చు.