Farmer Super Idea : రైతన్నా ఐడియానా మజాకా..! మోటారు సైకిల్‌తో పొలం దున్నేస్తున్న తాతా మనమళ్లు

ఉపాయం లేనివారిని ఊరినుంచి తరిమేయాలన్నారు పెద్దలు. ఉన్నదానితోనే ఉపాయంతో వ్యవసాయం చేస్తున్న ఈ రైతు ఏ ఇంజనీర్ కు తక్కువ కాదని నిరూపించాడు. తన మనుమడు సహాయంతో మోటర్ సైకిత్ తో పొలాన్ని ఎలా దున్నేశాడో చూస్తే వావ్..మట్టిలో మాణిక్యాలు అనిపిించి తీరుతుంది.

Telangana Farmer Super Idea : వ్యవసాయంలో సైతం యాంత్రికీకరణ రోజు రోజుకు పెరిగిపోతుంది. రైతులకు వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉండే బసవన్నల సంఖ్య సైతం తగ్గిపోయింది. దీంతో సన్నకారు చిన్నకారు రైతులు వ్యవసాయ పనులు చేయడానికి అందుబాటులో ఉన్న యంత్రాలను ఉపయోగిస్తున్నారు. అయితే యంత్రాల ధరలు సైతం పెరిగిపోవడంతో గిట్టుబాటు కావడం లేదు. పైగా దానికి డబ్బులు ఉండాలి. కానీ ఉపాయం ఉంటే ఏదైనా చేయొచ్చని నిరూపించారు తాతా మనుమళ్లు.

తెలంగాణ (Telangana )లోని నిర్మల్ జిల్లా(Nirmal District)లోని మండల కేంద్రమైన ముధోల్ కు చెందిన సొంకాంబ్లీ బాబు అనే రైతు తన పంట చేనులో వేసిన పత్తి పంటలో వేయటానికి ట్రాక్టర్ వినియోగించకుండా వినూత్నంగా ఆలోచించాడు. తనకున్న మోటారు సైకిల్‌తో పంట చేనులో వ్యవసాయ పనులు చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. రైతు ఐడియా అదిరిందయ్యా అని ప్రతి ఒక్కరు ప్రశంసించారు. వినూత్న పనులు చేపట్టవచ్చని రైతు నిరూపించాడు.

పొలం దున్నటానికి ఎడ్లు లేకపోయినా తన లునా (Luna) తోనే వ్యవసాయ పనులు పూర్తి చేశాడు. రైతు మాట్లాడుతూ తనకు ఉన్న ఎకరం నరా భూమిలో వేసిన పత్తిలో గుంటుకు కొట్టడానికి ఎడ్లు లేకపోవడంతో మోటారు సైకిల్‌తోనే పని కానిచ్చానని తెలిపారు. ట్రాక్టర్ తో పనులు చేపడితే ఆర్థికంగా భారం అవుతుందని తెలిపాడు ఈ పేద రైతు. ఉపాయం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించి చూపించిన ఈ రైతు ఐడియా సూపర్ అంటున్నారు చూసేవారంతా.

 

ట్రెండింగ్ వార్తలు