Bandi Sanjay Kumar : దమ్ముంటే.. బాబర్ పేరుతో జనంలోకి వెళ్లాలి- కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు బండి సంజయ్ సవాల్

ఒకరు కులాన్ని నమ్ముకొని వస్తున్నారు. ఇంకొకరు సూటుకేసులు నమ్ముకొని వస్తున్నారు. దుబ్బాకలో చెల్లని రూపాయి మెదక్ లో చెల్లుతుందా? అని అంటున్నారు.

Bandi Sanjay Kumar : తెలంగాణలో ఎన్నికల హీట్ తారస్థాయికి చేరింది. నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సై అంటే సై అంటూ కయ్యానికి కాలుదువ్వుతున్నారు. తాజాగా బీజేపీ నేత బండి సంజయ్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. కొడిమ్యాలలో బండి సంజయ్ మాట్లాడుతూ.. 6 గ్యారెంటీల మోసాలపై చర్చ జరుగుకుండా దారి మళ్లించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హామీలపై బండి సంజయ్ ధ్వజమెత్తారు.

”పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీ పెద్ద బోగస్. వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వలేనోడు.. తాలు, తరుగు లేకుండా వడ్లు కొనలేనోడు.. రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామంటే నమ్మేదెవరు? కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధులను ఎన్నడైనా చూశారా? ఏనాడైనా ప్రజల కోసం ఒక్క పోరాటమైనా చేశారా? ఆ రెండు పార్టీలది రెండో స్థానం కోసం ఆరాటమే. లోక్ సభ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో బీజేపీ గెలుపు ఖాయం. ఆ రెండు పార్టీలకు శ్రీరాముడి పేరు వింటేనే వణుకు పుడుతోంది. మేం శ్రీరాముడి భక్తులం.. వాళ్లకు దమ్ముంటే బాబర్ పేరుతో జనంలోకి వెళ్లాలి” అని సవాల్ విసిరారు బండి సంజయ్.

అటు మెదక్ లో రోడ్డు షోలో పాల్గొన్నారు మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలంటే మెదక్ లో బీజేపీ గెలవాలని ఆయన అన్నారు. ”రాముడిని నమ్ముకొని రఘునందనుడి పేరు పెట్టుకొని మీ ముందుకు వచ్చా. 400 సీట్లలో మెదక్ సీటు ఉండాలా? వద్దా? నేను మెదక్ లో మిమ్మల్ని నమ్ముకొని మీ ముందుకు వచ్చా. సబ్ కా సత్, సబ్ కా వికాస్ నమ్ముకొని బీజేపీ ప్రజల ముందుకు వచ్చింది. ఒకరు కులాన్ని నమ్ముకొని వస్తున్నారు. మరొకరు సూటుకేసులను నమ్ముకొని వస్తున్నారు. దుబ్బాకలో చెల్లని రూపాయి మెదక్ లో చెల్లుతుందా? అని హరీశ్ రావు అంటున్నారు.

మరి మీ మామను(కేసీఆర్) కామారెడ్డిలో తొక్కింది బీజేపీ జెండా అనేది మర్చిపోవద్దు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లలో గెలవబోతోంది. మెదక్ లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గెలిస్తే.. హరీశ్ రావు కారు డోర్ తీస్తారు. ప్రజలకు మాత్రం ఎలాంటి మేలు చెయ్యరు. వెంకటరామిరెడ్డి పోలీసులు లేకుండా మల్లన్న సాగర్ పోదాం వస్తావా..? ఎకరం 100 కోట్లతో 10 ఎకరాలు కొన్నాడు వెంకటరామిరెడ్డి. కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వెయ్యాలి? 4వేల పెన్షన్ ఇవ్వనందుకు వెయ్యలా..? సర్ కు 4 లక్షలు జీతం తీసుకోడానికి పైసలు ఉన్నాయి. 4 వేల పెన్షన్ ఇవ్వడానికి పైసలు లేవా..? నరేంద్రమోదీ నాయకత్వంలో పని చేయడానికి ఒక్క అవకాశం ఇవ్వండి. మెదక్ కు రైలు ఇచ్చినమా లేదా..? మాయ మాటలు చెప్పడానికి వస్తారు నమ్మకండి. దుబ్బాకలో గెలవని నేను మెదక్ లో గెలుస్తానో లేదో’ అని రఘునందన్ అన్నారు.

 

Also Read : తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బిగ్ ఫైట్.. ఓటర్లు ఎవరికి జైకొడతారో?

ట్రెండింగ్ వార్తలు