Bandi Sanjay Kumar : వార్ వన్ సైడే.. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ స్థానం ఇదే- బండి సంజయ్

కాంగ్రెస్ ‌నాయకులు కూడా రామభక్తులం అని అంటున్నారంటే అది బీజేపీ గొప్పతనం. రాక్షసులని, రామభక్తులుగా‌ మార్చిన ఘనత బీజేపీదే.

Bandi Sanjay Kumar : లోక్ సభ ఎన్నికల్లో వార్ వన్ సైడే అని కరీంనగర్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. దేశంలో మరోసారి బీజేపీదే హవా అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో మాకు ప్రధాన పోటీ కాంగ్రెస్ తోనే అని తేల్చి చెప్పారు. కరీంనగర్ లో‌ నన్ను‌ ఓడగొట్టడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటయ్యాయని బండి సంజయ్ ఆరోపించారు.

నామినేష‌న్లు ప్రారంభంమైనా కాంగ్రెస్ ‌పార్టీకి అభ్యర్థి దొరకడం లేదు. గత పార్లమెంటు ‌ఎన్నికల్లో‌ కాంగ్రెస్ ‌పార్టీకి డిపాజిట్ రాలేదు. బీజేపీని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం ‌కాంగ్రెస్ కి‌ లేదు. కాంగ్రెస్ ‌నాయకులు కూడా రామభక్తులం అని అంటున్నారంటే అది బీజేపీ గొప్పతనం. రాక్షసులని, రామభక్తులుగా‌ మార్చిన ఘనత బీజేపీదే. తెలంగాణ పొలిటికల్ లీగ్ అడడానికి అందరూ కలిసి గుంటనక్కలాగా వస్తున్నారు. బీజేపీ ఒకవైపు, అన్ని పార్టీలు ఒకవైపు. ప్రధాని అభ్యర్థి ఎవరో ఆ కూటమికి తెలియదు.

కేసీఆర్ ‌‌కుటుంబసభ్యులకి ఓడిపోతే పదవులు ఇవ్వలేదా? అవి పునారావాస కేంద్రాలా? బీఆర్ఎస్ ‌పార్టీ ఎమ్మెల్యే బీజేపీలో చేరతానంటే మేము ప్రోత్సహించలేదు. బీజేపీలోకి ఎవరు వచ్చినా రాజీనామా చేసి రావాలి. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడవ స్థానానికి పరిమితం అవుతుంది. బీర్ఎస్ సింబల్ కారు మీద పోటీ చెయడానికి ఎవరూ‌ ముందుకు రావడం లేదు” అని బండి సంజయ్ అన్నారు.

Also Read : వారు అందరూ బీజేపీలోకి వస్తున్నారు.. చివరికి రేవంత్ రెడ్డి కూడా వస్తారు: ఎంపీ అర్వింద్

ట్రెండింగ్ వార్తలు