Kcr Bus Yatra : లోక్‌సభ ఎన్నికలపై కేసీఆర్ ఫోకస్.. రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రలకు ప్లాన్

పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు గులాబీ బాస్.

Kcr Bus Yatra : అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడ్డ బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. రేపు బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఆ పార్టీ నేతలు సమావేశం కానున్నారు. ప్రతిపక్ష పార్టీగా అవతరించిన తర్వాత తొలిసారి కేసీఆర్ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం ద్వారా నేతలను పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం చేయనున్నారు.

17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయబోతున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్.. ఈ సమావేశంలోనే బీ-ఫారాలు అందచేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు గులాబీ బాస్. తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్రలు చేయాలని నిర్ణయించిన కేసీఆర్.. బస్సు యాత్ర రూట్ మ్యాప్ పై పార్టీ నేతలతో చర్చించనున్నారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేసీఆర్ ప్రచార సరళిని రూపొందించనున్నారు. ఇప్పటికే పలు చోట్ల బహిరంగ సభలు నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా మరిన్ని బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, కేంద్రం వైఫల్యాలను ఎండగట్టేలా ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది బీఆర్ఎస్.

Also Read : సీఎం రేవంత్‌ రెడ్డికి ఫుల్ డిమాండ్‌..! కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్‌గా కీలక బాధ్యతలు

 

ట్రెండింగ్ వార్తలు