Lok Sabha Elections 2024
Lok Sabha Elections 2024 : తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల పోరు రంజుగా సాగబోతోంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 6 నెలలకు జరగనున్న లోక్ సభ సమరానికి ప్రధాన పార్టీలన్నీ సిద్ధమయ్యాయి. ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు ఒకటి రెండు స్థానాలు మినహా మిగిలిన అన్ని సీట్లకూ అభ్యర్థులను ప్రకటించాయి. కేవలం ఖమ్మం, వరంగల్ సీట్లను బీజేపీ పెండింగ్ లో పెడితే.. హైదరాబాద్ సీటును మాత్రమే బీఆర్ఎస్ పెండింగ్ లో ఉంచింది. ఇక అధికార కాంగ్రెస్ కూడా గెలుపు గుర్రాల అన్వేషణను దాదాపు కొలిక్కి తీసుకొచ్చింది. ఇప్పటికే 9మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. మరో 8మందిపై కసరత్తు పూర్తి చేసింది. ఇవాళో రేపో అభ్యర్థుల పేర్లను కూడా అధికారికంగా ప్రకటించేందుకు రెడీ అవుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో వచ్చిన ఊపును కొనసాగించి 14 స్థానాలను గెలవాలని టార్గెట్ పెట్టుకుంది అధికార పార్టీ కాంగ్రెస్. ఇక కమలం పార్టీ కూడా కనీసం డబుల్ డిజిట్ చేరుకోవాలని తహతహలాడుతోంది. ఈ రెండు జాతీయ పార్టీల మధ్య నలిగిపోతున్న బీఆర్ఎస్.. మళ్లీ పుంజుకుని సత్తా చాటుకునేందుకు ఈ లోక్ సభ ఎన్నికలే టార్గెట్ గా పెట్టుకుంది. ఇలా మూడు ప్రధాన పార్టీలు ప్రత్యేక వ్యూహాలతో పార్లమెంట్ ఫైట్ కు సిద్ధమవుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి భారీగా వలసలను ప్రోత్సహించిన కాంగ్రెస్, బీజేపీలు ఎక్కువ టికెట్ల వలస నేతలకే ఇచ్చాయి.
ఇలా పార్టీలు మారిన వారి జాతకాలు ఎలా ఉండబోతున్నాయి? పార్టీ పలుకుబడి పని చేస్తుందా? నేతల ఇమేజీ ఆయా పార్టీలకు విజయాన్ని అందించబోతోందా? తెలంగాణలో 17లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 14 టార్గెట్ గా పెట్టుకుంటే.. బీజేపీ కనీసం పది స్థానాలైనా దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. ఇక బీఆర్ఎస్ గత లోక్ సభ ఎన్నికల సమయంలో కారు సారు 16 అంటే.. ఈసారి కారు సారు ఆరైనా రాకపోతాయా? అని ఫైట్ చేస్తోంది.
కాంగ్రెస్ పార్టీ 9 మంది అభ్యర్థులను, బీఆర్ఎస్ 16మంది, బీజేపీ 15 మంది అభ్యర్థులను ప్రకటించాయి. నియోజకవర్గాల వారీగా, అభ్యర్థుల వారీగా పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆయా పార్టీలలో వాతావరణం ఏముంది? ఆయా అభ్యర్థుల బలాలు ఏంటి? బలహీనతలు ఏంటి? ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ..
Also Read : ఈడీ ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చా? అధికారాలు ఏంటి?