Hrudayam Murali Review : ‘హృదయం మురళి’ మూవీ రివ్యూ.. అయిదుగురు హీరోయిన్స్, తమన్ నటించిన సినిమా..

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నటిస్తున్నాడు, అయిదుగురు హీరోయిన్స్, లవ్ స్టోరీ సినిమా అనడంతో ఈ సినిమాపై తెలుగులో కూడా ఆసక్తి నెలకొంది. (Hrudayam Murali Movie Review)

  • Updated on- July 11, 2026 / 02:36 PM IST

Hrudayam Murali Movie Review And Rating

Hrudayam Murali Review : తమిళ హీరో అథర్వ మురళి హీరోగా ప్రీతీ ముకుందన్, మాళవిక మోహనన్, జోనిత గాంధీ, కాయదు లోహర్, నిహారిక NM హీరోయిన్స్ గా తమన్, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో తెరకెక్కిన తమిళ సినిమా ‘ఇదయం మురళి’. తెలుగులో ఈ సినిమాని హృదయం మురళిగా రిలీజ్ చేసారు. తమిళ్ లో జులై 10న రిలీజ్ అవ్వగా తెలుగులో నేడు జులై 11న ఈ సినిమా రిలీజ్ అయింది. మైత్రి మూవీ మేకర్స్ తెలుగులో ఈ సినిమాని రిలీజ్ చేసారు.

కథ విషయానికొస్తే..

హృదయ(అథర్వ మురళి) ఇండియాలో రేపు పెళ్లి పెట్టుకొని ఇవాళ న్యూయార్క్ లో తన ఫ్రెండ్స్ ఉంటాడు. తన మామయ్య (నట్టి సుబ్రహ్మణ్యం) ఫోన్స్ మీద ఫోన్స్ చేస్తూ ఉంటాడు. దీంతో హడావిడిగా ఇండియాకు బయలుదేరుతారు హృదయ, అతని ఫ్రెండ్స్. ఫ్లైట్ లో కలిసిన ఓ వ్యక్తి(ఫహద్ ఫాజిల్)కి చిన్నప్పట్నుంచి తన ప్రేమకథలు చెప్పుకుంటూ వస్తాడు హృదయ.

చిన్నప్పుడు ఏమి తెలియని వయసులో హృదయ తన గీత టీచర్(జోనిత గాంధీ)ని ఇష్టపడతాడు. ఆమె తనకు ముద్దు పెట్టడం వల్లే ఆమెకు కడుపు వచ్చిందని అనుకోని ఆమెని డెలివరీ టైంలో కాపాడతాడు. ఆ తర్వాత స్కూల్ ఏజ్ లో ట్యూషన్, టెన్నిస్ కోచింగ్ దగ్గర చూసి సమంత(ప్రీతీ ముకుందన్)ని లవ్ చేస్తాడు. కానీ సమంత, సంయుక్త ఇద్దరు ట్విన్స్ అని అందులో ఎవర్ని లవ్ చేసాడో తెలియక, ఆమె నుంచి కూడా ఏ రెస్పాన్స్ లేకపోవడంతో బాధపడతాడు. కాలేజీ అయ్యాక హాస్పిటల్ లో డాక్టర్ అముద(కాయదు లోహర్)ని చూసి ప్రేమిస్తాడు. అక్కడే తన చిన్నప్పటి ఫ్రెండ్ సచిన్(తమన్), అతని లవర్ లాడో(నిహారిక NM) కలుస్తారు. దీంతో వీళ్ళు, మరికొంతమంది హృదయ చిన్నప్పటి ఫ్రెండ్స్ అంతా కలిసి లైఫ్ ఎంజాయ్ చేస్తారు. అముదకు కూడా తన ప్రేమని చెప్పలేకపోతాడు.

మరో పక్క తన మామయ్య కేబుల్ టీవీని ఎలాగైనా శాటిలైట్ ఛానల్ చేయాలనుకుంటాడు హృదయ. కొన్నేళ్ల తర్వాత హృదయకు అదితి(మాళవిక మోహనన్)తో పెళ్లి ఫిక్స్ అవుతుంది. మరి హృదయ పెళ్లి అదితితో జరుగుతుందా? హృదయ లైఫ్ లోకి మళ్ళీ సమంత, అముద, గీత టీచర్ ఎలా వస్తారు? వాళ్ళు రావడంతో హృదయ లైఫ్ ఎలా మారుతుంది? సచిన్ – లాడో లవ్ ట్రాక్ ఏంటి? హృదయ శాటిలైట్ ఛానల్ పెడతాడా? హృదయ చివరకు ఎవర్ని పెళ్లి చేసుకుంటాడు? హృదయ కథ చెప్పే ఫ్లైట్ లో వ్యక్తి ఎవరు? అసలు హృదయ అతని ఫ్రెండ్స్ న్యూయార్క్ కి ఎందుకు వెళ్లారు.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Love Oh Love Review : ‘లవ్ ఓ లవ్’ మూవీ రివ్యూ.. అబ్బాయిలు ఈ సినిమా అస్సలు మిస్ అవ్వకండి..

సినిమా విశ్లేషణ..

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నటిస్తున్నాడు, అయిదుగురు హీరోయిన్స్, లవ్ స్టోరీ సినిమా అనడంతో ఈ సినిమాపై తెలుగులో కూడా ఆసక్తి నెలకొంది. న్యూయార్క్ నుంచి హృదయ, అతని ఫ్రెండ్స్ ఇండియాకు బయలుదేరడం, ఫ్లైట్ లో ఫహద్ ఫాజిల్ కి కథ చెప్పడంతో సినిమా మొదలవుతుంది.

ఫస్ట్ హాఫ్ అంతా హీరో చిన్నప్పటి గీత టీచర్, సమంత – సంయుక్త లవ్ స్టోరీ ట్విస్ట్, అముద లవ్ స్టోరీలతో, సచిన్ – లాడో లవ్ స్టోరీతో సరదాగా, క్యూట్ గా, నవ్విస్తూ సాగుతుంది. ఇంటర్వెల్ కి తన ప్రేమ ఎవరికీ చెప్పలేకపోయాడు అనే బాధతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి నెలకొంటుంది. సెకండ్ హాఫ్ మళ్ళీ సమంత తన లైఫ్ లోకి రావడం, సచిన్ పెళ్లితో సరదాగా మొదలయిన తర్వాత బాగా సాగదీశారు. అముద మళ్ళీ కనపడటం, చివర్లో గీత టీచర్ ట్విస్ట్, అదితితో నిచ్చితార్ధం అంటూ సాగదీస్తూ హీరో ఎవర్ని పెళ్లి చేసుకోవాలి, ఎవరితో ఉండాలి అనే కన్ఫ్యూజన్ లో బాగా సాగదీశారు.

గీత్ టీచర్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. అసలు ఈ సినిమా చూస్తుంటే రవితేజ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ గుర్తొస్తుంది. కాకపోతే అందులో హీరోయిన్స్ మళ్ళీ హీరో లైఫ్ లోకి రారు. ఇందులో వచ్చి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. క్లైమాక్స్ కూడా నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ లాగా సింపుల్ గా హ్యాపీ ఎండ్ ఇవ్వొచ్చు. కానీ బాగా సాగదీసి హీరో పాత్రను కన్ఫ్యూజ్ లో పెట్టి క్లైమాక్స్ సరిగ్గా రాసుకోకుండా సాగదీసి ఏం ఎండ్ ఇవ్వాలో తెలియక పార్ట్ 2 కి లీడ్ ఇచ్చారు. ఆస్ట్రేలియాలో ఉండే అమ్మాయిని రెండు గంటల్లో వైజాగ్ కి ఎలా తీసుకొచ్చారో లాజిక్ దర్శకుడికే తెలియాలి. సింపుల్ గా జరిగే కథని నాసా వరకు తీసుకెళ్లడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కథ ఇక్కడే సింపుల్ గా రాసుకునే అవకాశం ఉంది కదా అనిపిస్తుంది.

హీరో – ఫ్రెండ్స్ ట్రాక్స్ బాగుంటాయి. తమన్ తో ఉన్న కొన్ని సీన్స్ ఫుల్ గా నవ్విస్తాయి. తమన్ కి సపరేట్ లవ్ ట్రాక్ కూడా బాగుంటుంది. చిన్నప్పుడు ముద్దు పెడితే కడుపు వస్తుందేమో అని గీత టీచర్ తో వచ్చే సీన్స్ ఫుల్ గా నవ్విస్తాయి. ప్రేమించినా బయటకు చెప్పలేని ఓ 90s అబ్బాయి కథ అనే ఉద్దేశంలో ఈ సినిమాని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఫ్రెండ్స్ తో ఈ సినిమాని సరదాగా చూడొచ్చు. ఈ సినిమా చూస్తున్నంత సేపు 90s కిడ్స్ కి తమ పాత ప్రేమలు గుర్తుకు రావడం ఖాయం. అథర్వ మురళి తండ్రి మురళి ఒకప్పుడు తమిళ్ లో మంచి హీరో. అతను తీసిన ఇదయం సినిమా పెద్ద హిట్ అయి క్లాసిక్ గా నిలిచింది. అలా ఇదయం మురళి అనే టైటిల్ ఈ సినిమాకు పెట్టారు కానీ టైటిల్ కి కథకు సంబంధం లేదు. ఇదయం(హృదయం)అని పెట్టినా బాగుండేదేమో.

నటీనటుల పర్ఫార్మెన్స్..

అథర్వ మురళి సైలెంట్ గా, రిజర్వ్‌డ్ గా ఉండే పాత్రలో బాగానే నటించాడు. ప్రీతీ ముకుందన్ డ్యూయల్ రోల్ లో క్యూట్ గా కనిపిస్తూ బాగా నటించింది. కాయదు లోహర్ కూడా అందంగా అలరిస్తూ ఎమోషనల్ సీన్ లో కూడా బాగా నటించింది. జోనిత గాంధీ టీచర్ పాత్రలో మెప్పించింది. నిహారిక NM కూడా ఎక్స్‌ట్రావర్ట్ గా తన పర్ఫార్మెన్స్ తో అలరించింది.

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నటుడిగా మారి ఈ సినిమాతో మెప్పించాడు. చాలా సీన్స్ లో ఫుల్ గా నవ్విస్తాడు. ఈ సినిమా తర్వాత తమన్ కి నటుడిగా అవకాశాలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. తమన్ ఓ పక్క నటిస్తూనే ఈ సినిమాకు మ్యూజిక్ కూడా ఇవ్వడం గమనార్హం. మాళవిక మోహనన్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి మెప్పించింది. నట్టి సుబ్రహ్మణ్యం హీరో మామయ్య పాత్రలో ఒదిగిపోయారు. ఫహద్ ఫాజిల్ గెస్ట్ పాత్రలో మెప్పించాడు. మిగిలిన నటీనటులంతా వారి పాత్రల్లో బాగానే మెప్పించారు. సోషల్ మీడియా స్టార్, ఇటీవల గుర్తుకొస్తున్నాయి సిరీస్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన యశశ్రీరావు కూడా ఈ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చింది.

Also Read : Lenin Review : ‘లెనిన్’ మూవీ రివ్యూ.. అయ్యగారు నెంబర్ 1 అనిపించుకున్నారా..?

సాంకేతిక అంశాలు..

సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం కలర్ ఫుల్ గా రిచ్ గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు యావరేజ్. తెలుగు డబ్బింగ్ చాలా మందికి సెట్ అవ్వలేదు. తమన్ డబ్బింగ్ కూడా వేరే వాళ్ళతో చెప్పించారు. చిన్నప్పట్నుంచి లైఫ్ లో ఉండే వన్ సైడ్ లవ్ స్టోరీలతో ఆసక్తికర కథాంశంతో చివర్లో సాగదీసి సరైన ఎండింగ్ లేకుండా రాసుకున్నారు. సాంకేతికంగా మాత్రం బాగానే తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు చాలానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

మొత్తంగా ‘హృదయం మురళి’ సినిమా ప్రేమకథలతో కన్ఫ్యూజన్ గా సాగిన ఓ 90s అబ్బాయి కథ. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.