Karate Kalyani: బిగ్‌బాస్ ఓటింగ్ రిజల్ట్, బిగ్‌బాస్ నుంచి కరాటే కళ్యాణి ఔట్

  • Publish Date - September 19, 2020 / 05:48 PM IST

Bigg Boss 4 Telugu Voting Result Karate Kalyani: బిగ్‌బాస్ ఆడియన్స్‌లో యమ క్లారిటీ ఉంది. తొలివారం నామినేషన్స్‌లో దర్శకుడు సూర్య కిరణ్ ఇంటికెళ్లాడు. రెండో వారం నామినేషన్స్‌లో తొమ్మిదిమంది నామినేట్ అయినా పబ్లిక్ మూడ్ అంతా కళ్యాణికి నెగిటీవ్‌గానే ఉంది. వీళ్లలో ఎలిమినేట్ కాబోతున్నది ఎవరు?

సూర్యకిరణ్‌తోపాటు ఆడియన్స్‌‌ను ఇరిటేట్ చేసింది ఎవరంటే కరాటే కళ్యాణే. ఫస్ట్‌వీక్‌లో Karate Kalyani లిమినేషన్‌కి నామినేట్ కాలేదు. అందుకే బైటకుపంపించే ఛాన్స్ మిస్ అయ్యింది.. చాలామంది కామెంట్ చేశారు. లేదంటే సీజన్ 3లో నటి హేమలాగే ఇంటికి పంపించేవాళ్లమని కామెంట్స్ చేశారు. రెండో వారం నామినేషన్స్‌లోకి వచ్చిన తొమ్మది మందిలో కరాటే కళ్యాణి ఉంది. నోయల్, గంగవ్వ, మొనాల్ గజ్జర్, కరాటే కళ్యాణి, సొహైల్, అమ్మా రాజశేఖర్ కుమార్ సాయి, అభిజిత్‌‌, దేత్తడి హారిక‌లు రెండో వారం నామినేషన్స్‌లో ఉన్నారు. వీళ్లో ఒకరు ఎలిమినేట్ కావాలి. ఎవరా కాంటిస్టెంట్?



రెండో వారం నామినేషన్స్‌లో ఓటింగ్ Karate Kalyaniకి వ్యతిరేకంగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. తొలిరోజే ప్రేక్షకులకు చిరాకు. తానేదో బిగ్ బాస్ హౌస్‌కి లీడర్ అన్నట్టు, డామినేట్ చేయడానికి ప్రయత్నించడం, ఇంటి సభ్యులకు ఆర్డర్లు వేయడం ఆడియన్స్‌కు నచ్చలేదు. నాగార్జున కూడా.. హౌస్‌లో ఎవర్నీ మాట్లాడనీయవా అని నాగార్జన Karate Kalyaniకి క్లాస్ పీకారు. అభిజిత్‌, యాంకర్ దేవిలతో గొడవపడటం కళ్యాణికి మైనస్.



రెండో వారం నామినేషన్స్‌లోనూ గంగవ్వ ఉన్నా, అమెకు ఓట్లలో ఢోకాలేదు. గంగవ్వ బిగ్ బాస్ హౌస్‌లో ఉండాలని కోరుకున్నవాళ్లు చాలామందే ఉన్నారు. రూరల్‌లో గంగవ్వకు మంచి ఫాలోయింగ్ పెరిగింది. గంగవ్వ.. తనకు ఆరోగ్యం బాలేదని.. బిగ్ బాస్ హౌస్‌ నుంచి పంపేయాలని బిగ్ బాస్‌ని వేడుకుంటూ కన్నీళ్లు పెట్టుకోవడంతో జనం ఆమెను పంపిస్తారా?

అనారోగ్య కారణాలతో గంగవ్వ కోరుకున్నట్టే ఇంటి నుంచి పంపించాలని కొందరు అంటున్నా… చివరికి ఆమెకు ఓట్లుబాగానే పడ్డాయి. Karate Kalyani, కుమార్ సాయి‌లు రెండో వారం నామినేషన్స్‌లో డేంజర్ జోన్‌లో ఉన్నారు.



మొదటి వారంతో పోల్చుకుంటే కళ్యాణి రెండో వారంలో గేర్ మార్చింది. ఎంటైర్ టైన్ చేయడానికి ట్రైచేసింది. యంగ్ కంటెస్టెంట్లతో పోటీ పడింది. అయినా ఆడియన్స్ మాత్రం Karate Kalyaniకి ఇంకోఛాన్స్ ఇవ్వాలనుకోలేదు.