ఫిదా సినిమాలోని ‘వచ్చిండే, మెల్లా మెల్లగ వచ్చిండే’ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో అక్షరాలా 200 మిలియన్ వ్యూస్ మార్క్ టచ్ చేసింది..
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, మలయాళీ ముద్దుగుమ్మ సాయి పల్లవి జంటగా, శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో, దిల్ రాజు నిర్మించిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ఫిదా.. తెలంగాణా యాసలో.. ‘భానుమతి.. హైబ్రీడ్ పిల్ల.. ఒకటే పీస్’ అంటూ కుర్రకారుని కవ్వించిన సాయి పల్లవికి యూత్ అంతా ఫిదా అయిపోయారు. ఈ సినిమాలో ‘వచ్చిండే, మెల్లా మెల్లగ వచ్చిండే’ అనే వీడియో సాంగ్ యూట్యూబ్‌లో బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.
ఈ పాట ఇప్పుడు మరో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. శక్తికాంత్ కార్తీక్ ట్యూన్‌కి, సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ రాయగా, మధుప్రియ పాడిన ఈ సాంగ్.. రీసెంట్‌గా యూట్యూబ్‌లో అక్షరాలా 200 మిలియన్ వ్యూస్ మార్క్ టచ్ చేసింది. అంటే 20 కోట్లమంది చూసారన్నమాట.. 20 కోట్ల మందిని ఫిదా చేసిన ఫిదా మూవీ.. వరుణ్ తేజ్, సాయి పల్లవిల కెరీర్‌లో ఓ మైల్ స్టోన్‌గా నిలిచిపోయింది.
వాచ్ సాంగ్..