జేమ్స్ బాండ్ సిరీస్ లో 25వ సినిమా!

  • Publish Date - April 29, 2019 / 06:08 AM IST

ప్రపంచవ్యాప్తంగా జేమ్స్ బాండ్ 007 సిరీస్ కి వీరాభిమానులు ఉన్నారు. హాలివుడ్ యాక్షన్ మూవీ సిరీస్ లో జేమ్స్ బాండ్ సినిమాలకి ఉన్నంత క్రేజ్ మరే సినిమాలకి లేదు. జేమ్స్ బాండ్ సినిమా వస్తోందంటే ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ భారీ యాక్షన్ సీన్స్ తో క్షణ క్షణం థ్రిల్ చేసే జేమ్స్ బాండ్ మూవీస్ కి సూపర్ హీరోల సినిమాలకంటే కూడా క్రేజ్ ఎక్కువే. ప్రస్తుతం బాండ్ సిరీస్ లో ఇప్పుడు 25వ సినిమా రాబోతుంది. డానియెల్ క్రేగ్ అయిదోసారి జేమ్స్ బాండ్ పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాకి క్యారీ జోజీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఏప్రిల్ 28న జమైకాలో సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. 

జేమ్స్ బాండ్ సినిమాల్లో విలన్ పాత్ర హీరో క్యారెక్టర్ ని సైతం డామినేట్ చేసే రేంజ్ లో ఉంటుంది. అందుకే బాండ్ సినిమాల్లో హీరోకి ఎంత పేరొస్తుందో విలన్ కి కూడా అంతే గుర్తింపు లభిస్తుంది. ప్రస్తుతం తెరకెక్కనున్న బాండ్ మూవీలో బొహిమియాన్ రాస్పోడి సినిమాకిగాను ఇటీవలే బెస్ట్ యాక్టర్ గా ఆస్కార్ అందుకున్న రమీ మలేక్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇక జేమ్స్‌ బాండ్‌గా డానియల్ క్రేగ్ నటిస్తోన్న చివరి సినిమా ఇదే. సైంటిస్టులను కిడ్నాప్ చేసిన ఓ విలన్ కోసం సాగించే ఇన్వెస్టిగేషన్ బ్యాక్ డ్రాప్ లో ఈసారి బాండ్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. 

డేనియల్ క్రేయిగ్ కాంట్రాక్ట్ ముగియడంతో నెక్స్ట్ కొత్త బాండ్ రాబోతున్నాడు. రాబోయే జేమ్స్ బాండ్ సినిమాల్లో హెన్రీ గోల్డింగ్ బాండ్ పాత్రలో నటించనున్నాడు. హెన్రీ గోల్డింగ్ బిబిసిలో ప్రసారమయ్యే ది ట్రావెల్ షో ప్రోగ్రాంకి యాంకర్ అంతేకాదు రిచ్ ఏషియన్స్ అనే సినిమాతో పాటుగా పలు హాలివుడ్ మూవీస్ లో హెన్రీ నటించాడు.