Bigg Boss Season 9: గుండు అంకుల్, బాడీ షేమింగ్.. మాస్క్ మ్యాన్ కి మండింది.. పాపం ఇమ్మాన్యుయేల్!

బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయ్యింది. అప్పుడే(Bigg Boss Season 9) ఒకరోజు కూడా గడించింది. ఇప్పటికే ఒనేర్స్, టెనెంట్స్ అని వేరు చేసి కాకపెట్టిన బిగ్ బాస్.

Bigg Boss Season 9: గుండు అంకుల్, బాడీ షేమింగ్.. మాస్క్ మ్యాన్ కి మండింది.. పాపం ఇమ్మాన్యుయేల్!

Masked Man gets serious about Emmanuel in Bigg Boss season 9

Updated On : September 8, 2025 / 8:35 PM IST

Bigg Boss Season 9: బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయ్యింది. అప్పుడే ఒకరోజు కూడా గడించింది. ఇప్పటికే ఒనేర్స్, టెనెంట్స్ అని వేరు చేసి కాకపెట్టిన బిగ్ బాస్.. ఆటను ఇంకాస్త హీట్ ఎక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా డే 1 సంబందించిన మూడవ ప్రోమోను విడుదల చేశాడు బిగ్ బాస్(Bigg Boss Season 9). ఇందులో మాస్క్ మ్యాన్, కమెడియన్ ఇమ్మాన్యుయేల్ మధ్య వాడీ, వేడి వాదన జరిగింది.

Naga Babu: బిగ్ బాస్ కంటెస్టెంట్ కి మెగా సపోర్ట్.. నాగబాబు స్పెషల్ పోస్ట్.. ఇంతకీ ఎవరతను?

ఇంట్లోకి వచ్చిన సెలెబ్రెటీ కంటెస్టెంట్ లకు కామనర్స టాస్కులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే, ఇమ్మాన్యుయేల్ కు హౌస్ క్లీనింగ్ కి సంబందించిన టాస్క్ ఇచ్చాడు. ఈ వారం అంత ఇమ్మాన్యుయేల్ హౌస్ క్లీన్ చేయాల్సి ఉంటుంది. అదే విషయాన్ని బాగ్ బాస్ తాజా ప్రమోలో ఇమాన్యుయెల్ ను అడిగాడు. గార్డెన్ ఏరియా అంత క్లీన్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని. దానికి సమాధానంగా ఇమ్మాన్యుయేల్.. అది ఊడిస్తే పోవడంలేదు ఒక్కొక్కటీ ఏరాలి బిగ్ బాస్ అంటూ కామెడీ చేశాడు.

దానికి, మళ్ళీ బిగ్ బాస్ గార్డెన్ ఏరియా అంత క్లీన్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని అడిగారు. అలాగే ఈసారి టైం చెప్పాల్సింది నువ్వు కాదు నీ మెంటర్ అంటూ ఆ భాద్యత మాస్క్ మం కి ఇచ్చాడు బిగ్ బాస్. అది వినగానే, కొంచం చూసి చెప్పు బ్రో అంటూ కామెడీగా మాస్క్ మ్యాన్(మెంటర్) ను అడిగాడు ఇమ్మాన్యుయేల్. దాంతో, నువ్వు కూడా చూసి మాట్లాడాలి కదా బ్రదర్ అంటూ సీరియస్ అయ్యాడు. గుండు ఎవరు, అంకుల్ ఎవరు? బాడీ షేమింగ్ ఏంటి అంటూ రెచ్చిపోయాడు. దానికి ఇమ్మాన్యుయేల్ నేను సారీ కూడా చెప్పాను అని అన్నాడు. నేను కూడా ఎదో ఒకటి అనేసి సారీ అంటాను నీకు ఒకేనా అంటూ మరోసారి ఫైర్ అయ్యాడు. లిమిట్ ఉండాలి అంటూ హెచ్చరించాడు. అది కాస్త ఇద్దరిమధ్య మాటల యుద్దానికి దారి తీసింది. మరి ఆ తరువాత ఎం జరిగింది అనేది ఎపిసోడ్ లోనే చూడాలి. మొత్తానికి ఈ ప్రోమో మాత్రం ఆడియన్స్ లో కాస్త ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది అనే చెప్పాలి.