Naga Babu: బిగ్ బాస్ కంటెస్టెంట్ కి మెగా సపోర్ట్.. నాగబాబు స్పెషల్ పోస్ట్.. ఇంతకీ ఎవరతను?
బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ గా మొదలయ్యింది. (Naga Babu)ఈసారి కేవలం సెలెబ్రెటీలకు మాత్రమే కాకండా సామాన్యులకు సైతం పెద్ద పీట వేశారు.

Nagababu posts in support of Bigg Boss contestant Bharani Shankar
Naga Babu: బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ గా మొదలయ్యింది. ఈసారి కేవలం సెలెబ్రెటీలకు మాత్రమే కాకండా సామాన్యులకు సైతం పెద్ద పీట వేశారు. ఏకంగా 5 మంది సామాన్యులను బిగ్ బాస్ లోకి పంపించారు. దీంతో, ఈ సీజన్ పైన ఆడియన్స్ లో మంచి ఆసక్తి నెలకొంది. ఆలాగే, ఆటలో కూడా చాలా రకాల మార్పులను చేశారు. ఇంతకాలం బిగ్ బాస్ హౌస్ అంటే కేవలం ఒక ఇల్లు మాత్రమే ఉండేది. ఇప్పుడు సెలబ్రెటీలను, సామాన్యులను వేరు చేస్తూ రెండు ఇళ్లతో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది బాగ్ బాస్ సీజన్ 9. వీటన్నిటినీ పరిచయం చేస్తూ సాగిన గ్రాండ్ లాంచ్ ఈవెంట్ కూడా ఆడియన్స్ లో మంచి ఆసక్తిని నెలకొల్పింది.
Balakrishna: బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం.. ఆ ఘనత దక్కిచుకున్న తొలి సౌత్ హీరోగా రికార్డ్
ఇదిలా ఉంటే, ఇంకా ఒక్క ఎపిసోడ్ కూడా టెలికాస్ట్ కాకముందే ఒక కంటే స్టెంట్ కి మెగా సపోర్ట్ అంటే మెగా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ దొరికింది. మెగా బ్రదర్ నాగబాబు(Naga Babu) ఆ కంటెస్టెంట్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు సీరియల్ యాక్టర్ భరణి శంకర్. అవును, నాగ బాబు ఆ మధ్య సీరియల్స్ లో నటించిన విషయం తెలిసిందే. ఆయన ప్రధాన పాత్రలో చేసిన సూపర్ హిట్ సీరియల్ “ఛీ.ల.సౌ.. స్రవంతి” సీరియల్ లో భరణి శంకర్ కూడా కీ రోల్ చేశాడు. ఆ సమయంలోనే నాగబాబు, భరణి శంకర్ మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది.
ఇప్పుడు ఆ బాండింగ్ తోనే మెగా బ్రదర్ నాగబాబు భరణి శంకర్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్ట్ చేశారు. “నాకు అత్యంత సన్నిహితుడు భరణి శంకర్ బిగ్ బాస్ లో అడుగుపెడుతున్న సందర్బంగా ఆయనకు నా శుభాకాంక్షలు. ఈ ప్రయాణం అతడికి మంచి విజయాన్ని, గుర్తింపుని అందించాలని కోరుకుంటున్నాను” అంటా పోస్ట్ పెట్టారు నాగ బాబు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Wishing my dear Bharani Shankar, who is very close to me, all the very best as he steps into Bigg Boss Season 9. May this journey bring him all the success and recognition he truly deserves! pic.twitter.com/LsYZdbM8cl
— Naga Babu Konidela (@NagaBabuOffl) September 7, 2025