Allu Aravind: మానాన్న జైలుకు వెళ్లారు.. అల్లు అరవింద్ వ్యాఖ్యలు వైరల్
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) తల్లి అల్లు కనకరత్నం ఈ మధ్యనే కాలం చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజున హైద్రాబాద్ లో ఆమె పెద్ద కర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు.

allu aravind said that allu ramalingaiah went to jail
Allu Aravind: ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నం ఈ మధ్యనే కాలం చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజున హైద్రాబాద్ లో ఆమె పెద్ద కర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం అల్లు అరవింద్(Allu Aravind) ప్రెస్ మీట్ నిర్వహించారు. తన తల్లిగారి గొప్పతనం గురించి మీడియాతో పంచుకోవాలని చెప్పుకొచ్చారు.
Bigg Boss Season 9: గుండు అంకుల్, బాడీ షేమింగ్.. మాస్క్ మ్యాన్ కి మండింది.. పాపం ఇమ్మాన్యుయేల్!
ఈ సందర్భాంగా ఆయన మాట్లాడుతూ.. మా తల్లిగారు గొప్ప జీవితాన్ని గడిపారు. చిరంజీవి గారిని అల్లుడిగా పొందగలిగారు, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ మనవులుగా ఉన్నారు. ఈ రెండు ఫ్యామిలీల నుండి ఇంకా ఎంతో మంది స్టార్స్ ను ఆమె చూశారు. మనవలు, మునిమనవలను కూడా ఆమె చూశారు. అందుకే, ఆమెకు ఆనందంగా ముగింపు పలకాలని అనుకున్నాం అంటూ చెప్పుకొచ్చారు.
Mega-Allu Family Together: అల్లు కనకరత్నం పెద్ద కర్మలో పవన్, రామ్ చరణ్.. ఈ ఫోటో గమనించారా?
ఇంకా ఆయన తన తల్లితండ్రుల పెళ్లి గురించి వివరిస్తూ.. రాట్నం వడుకుతున్న అల్లు కనకరత్నంను చూసిన అల్లు రామలింగయ్య ఆమె చాలా నచ్చడంతో తన పేరెంట్స్ సంబంధం మాట్లాడటానికి పంపించి ఒప్పించి పెళ్లి చేసుకున్నారట. ఆ సమయంలో ఆయన స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారట. అలాగే, కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న అల్లు రామలింగయ్య రెండు సార్లు జైలుకి కూడా వెళ్లారట. ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్నారు అల్లు అరవింద్.