నవీన్ చంద్ర, శాలిని జంటగా, డాక్టర్.అనిల్ విశ్వనాథ్ డైరెక్షన్‌లో 28’C అనే సినిమా రూపొందుతుంది. రీసెంట్‌గా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసారు..
టాలీవుడ్‌లో కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలకు ఆదరణ పెరుగుతుంది. భారీ స్టార్ కాస్టింగ్ లేకున్నా, ఆకట్టుకునే కథ, కథనాలుంటే చిన్న సినిమాలకు పట్టం కడుతున్నారు ప్రేక్షకులు. అదేకోవలో నవీన్ చంద్ర, శాలిని జంటగా, డాక్టర్.అనిల్ విశ్వనాథ్ డైరెక్షన్‌లో 28’C అనే సినిమా రూపొందుతుంది. రీసెంట్‌గా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసారు. హీరో నవీన్ చంద్రకి ఒక యాక్సిడెంట్‌లో బ్రెయిన్ ఇంజురీ అవుతుంది. అతను డాక్టర్ సలహా మేరకు కొన్ని ప్రత్యేక పరిస్థితులలోనే ఉండాల్సి వస్తుంది. అందులో ముఖ్యమైనదే 28’C టెంపరేచర్‌లో ఉండడం..
ఒకవేళ అలా కనుక లేకపోతే 10 నుండి 15 నిమిషాల లోపు అతను చనిపోతాడు.. ఇలాంటి ప్రాబ్లమ్ నుండి హీరో ఎలా బయట పడ్డాడు, అతని ప్రేమని ఎలా గెలుచుకున్నాడు? అనేది ఈ సినిమా కథ అని టీజర్‌ని బట్టి అర్థమవుతుంది. రెగ్యులర్ సినిమాలకు వైవిధ్యంగా, క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న 28’C లో ప్రియదర్శి, వైవా హర్ష, అభయ్ బెతిగంటి, దేవియాని శర్మ, సంతోషి శర్మ, నితీష్ పాండే తదితరులు నటిస్తున్నారు. టీజర్‌లో హీరో, హీరోయిన్, జయప్రకాష్, రాజా రవీంద్ర తప్ప ఇంకెవర్నీ చూపించలేదు. టీజర్ చూస్తే సినిమాలో ఏదో విషయం ఉందనిపిస్తుంది. ఈ సినిమాకి సంగీతం : శ్రావణ్ భరద్వాజ్, నిర్మాత : సాయి అభిషేక్.
వాచ్ 28’C టీజర్..