భారతీయుడు 2 షూటింగ్‌లో ప్రమాదం: మృతులు వీరే.. డైరెక్టర్ శంకర్‌కు తీవ్రగాయాలు

కమల్ హాసన్ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు-2(ఇండియన్ 2) చిత్ర షూటింగ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. షూటింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ క్రేన్

  • Published By: veegamteam ,Published On : February 20, 2020 / 02:42 AM IST
భారతీయుడు 2 షూటింగ్‌లో ప్రమాదం: మృతులు వీరే.. డైరెక్టర్ శంకర్‌కు తీవ్రగాయాలు

Updated On : February 20, 2020 / 2:42 AM IST

కమల్ హాసన్ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు-2(ఇండియన్ 2) చిత్ర షూటింగ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. షూటింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ క్రేన్

కమల్ హాసన్ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు-2(#Indian2) చిత్ర షూటింగ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. షూటింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ క్రేన్ విరిగిపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్ లోనే చనిపోయారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. డైరెక్టర్ శంకర్ కి(director s shankar) కూడా తీవ్రగాయాలయ్యాయి. ఆయన కాలు ఫ్రాక్చర్ అయ్యింది. 

షూటింగ్ సమయంలో విరిగిపడిన భారీ క్రేన్:
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నై సమీపంలోని పూనమల్లి(poonamalle) దగ్గర జరుగుతోంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కమల్ హాసన్(kamal haasan) సెట్స్ లోనే ఉన్నారు. ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. సహాయక చర్యల్లో కమల్ హాసన్ కూడా పాల్గొన్నారు. బుధవారం(ఫిబ్రవరి 19,2020) రాత్రి ఈవీపీ ఫిల్మ్ సిటీలో(EVP Film City) ఈ ఘటన జరిగింది. ఈ చిత్ర షూటింగ్ కొన్ని రోజులుగా ఇక్కడే జరుగుతోంది. షూటింగ్ లో భాగంగా భారీ క్రేన్ ఏర్పాటు చేశారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆ భారీ క్రెయిన్ పడిపోయింది. పక్కనే కెమెరా డిపార్ట్‌మెంట్ దగ్గర శంకర్ ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

శంకర్ కాలు ఫ్రాక్చర్.. పర్సనల్ అసిస్టెంట్ మృతి:
ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ప్రాణానికి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు. ఘటనా స్థలంలో కమల్ హాసన్ సహాయక చర్యల్లో స్వయంగా పాల్గొన్నారు. తన సినిమా షూటింగ్‌లో ఈ ఘటన జరగడం పట్ల కమల్ కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ప్రమాదంలో చనిపోయిన ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నారు. ఆయన పేరు కృష్ణ(34). మరో వ్యక్తి ప్రొడక్షన్ అసిస్టెంట్ చంద్రన్ (60). శంకర్ పర్సనల్ అసిస్టెంట్ 28 ఏళ్ల మధు కూడా చనిపోయారు. 

మృతుల సంఖ్య పెరిగే అవకాశం:
ఇండియన్ 2 సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా EVP ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. భారీ క్రెయిన్ కావడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. డైరెక్టర్ మానిటర్ చూసుకునే టెంట్‌పైనే క్రెయిన్ పడటంతో శంకర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడని తెలుస్తోంది. ఆయన కాలు పూర్తిగా ఫ్రాక్చర్ అయిందని కొందరు తమిళ జర్నలిస్టులు ట్వీట్ చేస్తున్నారు. పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటన తమిళ సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఫోన్ చేసి ఘటనపై తెలుసుకున్నట్లు సమాచారం.

ప్రతిష్టాత్మకంగా భారతీయుడు-2:
డైరెక్టర్ శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భారతీయుడు-2ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ తోపాటు సిద్దార్థ, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్‌సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం పలు భాషల్లో విడుదల చేయనున్నారు. కొన్ని రోజులుగా కమల్ రాజకీయాలతో పాటు భారతీయుడు 2 సినిమాతో బిజీగా ఉన్నారు. 2.0 సినిమా తర్వాత భారీ బడ్జెట్‌తో కమల్ హాసన్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఈ చిత్ర షూటింగ్ 30 శాతం పూర్తయింది. శంకర్-కమల్ హాసన్ కాంబినేషన్ లో 1996లో వచ్చిన భారతీయుడు చిత్రం భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ గా ఈ మూవీ నిలిచింది. దానికి సీక్వెల్ గా ఇండియన్2 తీస్తున్నారు.

Read More>>ముగ్గురు స్నేహితులను కోల్పోయాను : భారతీయుడు2 షూటింగ్‌లో ప్రమాదంపై కమల్‌హాసన్, ‘‘ఇండియన్ 2’’ ప్రమాదంనుండి కమల్, కాజల్ తృటిలో ఎలా తప్పించుకున్నారంటే!