Mohan Babu : మంచు కుటుంబం పై 3 FIR లు.. ఊహించని షాక్ ఇచ్చిన పోలీసులు..

తాజాగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కీలక ప్రకటన చేశారు. ఇప్పటికీ మంచు కుటుంబం పై 3 FIR లు నమోదు అయ్యాయని తెలిపారు.

3 FIRs against Manchu family The police gave an unexpected shock

Mohan Babu : మంచు ఇంట జరుగుతున్న గొడవల గురించి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కీలక ప్రకటన చేశారు. ఇప్పటికీ మంచు కుటుంబం పై 3 FIR లు నమోదు అయ్యాయని తెలిపారు. అలాగే ప్రస్తుతం వారి కేసుపై ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని…లీగల్ గా మేము ఏమి చేయాలో చేస్తామని తెలిపారు. ఇకపై మోహన్ బాబు అరెస్ట్ విషయంలో ఎటువంటి ఆలస్యం లేదని చెప్పారు.

అంతేకాదు ఇప్పటికే నోటీసు ఇచ్చామని.. కానీ వారు 24 వరకు టైం అడిగారని తెలిపారు. కోర్టు టైం ఇచ్చింది కాబట్టి మేము అరెస్ట్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. మోహన్ బాబు విచారణ పై మేము కూడా కోర్టు ను అడుగుతాము… ఇప్పటికే మోహన్ బాబు వద్ద గన్ లు కూడా చంద్రగిరి లో ఉన్నపుడు తీసుకున్నాడని.. రాచకొండ నుండి ఎలాంటి పర్మిషన్ గన్స్ లేవని చెప్పారు. ఆయన దగ్గర 2 గన్స్ ఉన్నాయి… Dbpl ఒకటి మరొకటి స్పానిష్ మెడ్ గన్ ఉంది… మళ్ళీ నోటీసు ఇచ్చాక మోహన్ బాబు కచ్చితంగా అటెండ్ అవ్వాలని తెలిపారు.

Also Read : Chiranjeevi – Upendra : చిరంజీవితో సినిమా తీయాలని సంవత్సరం తిరిగాను.. ఆయన వల్లే నాకు డైరెక్టర్ గా ఎక్కువ గ్యాప్..

మళ్ళీ టైం కావాలి అంటే పర్మిషన్ తీసుకోవాలి…లేదంటే వారంటీ ఇష్యు చేస్తాము…నిన్న వెళ్లి పిటిషనర్ ని కలిశాడని… ఆయన మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము… అని తెలిపారు రాచకొండ సిపి. మరి మంచు గొడవ ఇంకెక్కడి వరకు వెళ్తుందో చూడాలి. ఇక ఇప్పటికే మంచు కుటుంబంలో జరిగిన గొడవల నేపథ్యంలో  అన్నదమ్ములపైన మంచు విష్ణు, మనోజ్ లను పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి పిలిచి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.