Chiranjeevi – Upendra : చిరంజీవితో సినిమా తీయాలని సంవత్సరం తిరిగాను.. ఆయన వల్లే నాకు డైరెక్టర్ గా ఎక్కువ గ్యాప్..
ఉపేంద్ర మాట్లాడుతూ చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Kannada Star Upendra Interesting Comments on Megastar Chiranjeevi in UI Movie Pre Release Event
Chiranjeevi – Upendra : కన్నడ స్టార్ డైరెక్టర్, హీరో ఉపేంద్ర సరికొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తారని తెలిసిందే. దర్శకుడిగా మొదట్లో కొత్త కొత్త కథలతో హిట్స్ కొట్టిన ఉపేంద్ర ఆ తర్వాత హీరోగా మారారు. మొదట్లో దర్శకుడిగా వరుస సినిమాలు చేసిన ఉపేంద్ర ఆ తర్వాత దర్శకుడిగా చాలా గ్యాప్ తీసుకుంటూ అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నారు. ఉపేంద్ర దర్శకుడిగా హీరోగా చేస్తున్న UI సినిమా డిసెంబర్ 20న రిలీజ్ కానుంది.
ప్రస్తుతం ఉపేంద్ర UI సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే వచ్చిన సినిమా టీజర్, కంటెంట్ తో సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. మళ్ళీ ఈ సినిమాతో పాత ఉపేంద్ర కనిపిస్తాడని అంటున్నారు. ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేస్తుండటంతో నిన్న UI సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో ఉపేంద్ర మాట్లాడుతూ చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Also Read : PV Sindhu – Pawan Kalyan : పెళ్లి పిలుపు.. డిప్యూటీ సీఎంని కలిసిన పీవీ సింధు..
ఉపేంద్ర మాట్లాడుతూ.. అల్లు అరవింద్ గారితో, చిరంజీవి ఫ్యామిలీతో నాకు ఆల్మోస్ట్ 25 ఏళ్ళ బంధం ఉంది. నేను 1996 – 97 సమయంలో దర్శకుడిగా చిరంజీవి గారితో కలిసి సినిమా చేయాలని ఆల్మోస్ట్ ఒక సంవత్సరం తిరిగాను. స్క్రిప్ట్ రాసుకొని ఆయన ఛాన్స్ కోసం తిరిగాను. అప్పుడు నాకు అర్ధమయింది. చిరంజీవి గారు ఒక్కో సీన్ ని, డైలాగ్ ని పది సార్లు కాదు ఏకంగా వంద సార్లు ఆలోచించి చూస్తారు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు. అప్పుడు నేను అనుకున్న నేనేమో అక్కడ కన్నడలో సింపుల్ గా రాసేసి సినిమాలు తీసేసేవాళ్ళం. ఇక్కడ ఏమో ఇంత కష్టపడుతున్నారు, స్క్రిప్ట్ మీద సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. ఇక్కడ స్క్రిప్ట్ మీద ఒకటి, రెండు సంవత్సరాలు కూర్చొని మరీ పని చేస్తున్నారు. అప్పట్నుంచి నేను కూడా స్క్రిప్ట్ వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేశాను. నేను దర్శకుడిగా నా సినిమాలకు ఎక్కువ ఏళ్ళు గ్యాప్ రావడానికి కారణం స్క్రిప్ట్ వర్క్. అప్పట్నుంచి స్క్రిప్ట్ వర్క్ కి ఎన్నేళ్ళైనా సమయం తీసుకొని పర్ఫెక్ట్ గా రాసుకొని అప్పుడు సినిమాలు చేస్తున్నాను అని తెలిపారు. దీంతో ఉపేంద్ర వ్యాఖ్యలు వైరల్ అవ్వగా మెగాస్టార్ ఫ్యాన్స్ ఈ వ్యాఖ్యలను మరింత షేర్ చేస్తున్నారు.
Oorike aipotharaa ✨ Megastaruu 🥵🔥
@KChiruTweets 🙌🏼pic.twitter.com/Cxf9yy8bXz
— Ujjwal Reddy (@HumanTsunaME) December 15, 2024