PV Sindhu – Pawan Kalyan : పెళ్లి పిలుపు.. డిప్యూటీ సీఎంని కలిసిన పీవీ సింధు..

పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న పీవీ సింధు స్వయంగా పలువురు ప్రముఖులను కలిసి తమ పెళ్ళికి, రిసెప్షన్ కి రమ్మని ఆహ్వానిస్తున్నారు.

PV Sindhu – Pawan Kalyan : పెళ్లి పిలుపు.. డిప్యూటీ సీఎంని కలిసిన పీవీ సింధు..

PV Sindhu Meets AP Deputy CM Pawan Kalyan for Inviting to her Wedding

Updated On : December 16, 2024 / 11:30 AM IST

PV Sindhu – Pawan Kalyan : బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త వెంకట్ దత్త సాయిని వివాహం చేసుకోబోతుంది. ఇప్పటికే వీరిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. సింధు వివాహం డిసెంబర్ 22న ఉదయ్ పూర్ లో ఘనంగా జరగనుంది. డిసెంబర్ 20 నుంచే వివాహ వేడుకలు మొదలయి ఆ తర్వాత డిసెంబర్ 24న హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ వేడుక నిర్వహించనున్నారు.

Also See : Pushpa 2 Fight Scenes : పుష్ప 2 ఫైట్ సీన్స్ వర్కింగ్స్ స్టిల్స్ చూశారా? బన్నీ ఎంత కష్టపడ్డాడో..

దీంతో పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న పీవీ సింధు స్వయంగా పలువురు ప్రముఖులను కలిసి తమ పెళ్ళికి, రిసెప్షన్ కి రమ్మని ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని పీవీ సింధు తన తండ్రి పీవీ రమణతో కలిసి తన పెళ్ళికి ఆహ్వానించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో తన పెళ్లి పత్రికను పవన్ కళ్యాణ్ కు అందచేసి పెళ్లి, రిసెప్షన్ కు ఆహ్వానించారు పీవీ సింధు. అనంతరం పవన్ వారితో కాసేపు ముచ్చటించారు.

PV Sindhu Meets AP Deputy CM Pawan Kalyan for Inviting to her Wedding

దీంతో పవన్ కళ్యాణ్ డిసెంబర్ 24న హైదరాబాద్ లో జరగబోయే పీవీ సింధు రిసెప్షన్ వేడుకకు మాత్రం హాజరవుతారని సమాచారం. ప్రస్తుతం పీవీ సింధు పవన్ ని కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.