Viral Video : ‘3 ఇడియట్స్’ మూవీ సీన్ రియల్ లైఫ్‌లో.. తాతని బైక్ మీద హాస్పిటల్‌లోకి.. వైరల్ అవుతున్న వీడియో..
'3 ఇడియట్స్' మూవీలో తాతని బైక్ మీద హాస్పిటల్‌లోకి తీసుకెళ్లే సీన్ ఇప్పుడు రియల్ లైఫ్ లో జరిగింది.
- Saketh U
- Published On : February 13, 2024 / 12:27 PM IST
3 Idiots Movie Scene happened in Real Life Video goes Viral
Viral Video : హిందీలో అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన 3 ఇడియట్స్(3 Idiots) సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అదే సినిమా తమిళ్ – తెలుగులో విజయ్ తో స్నేహితుడు అనే టైటిల్ తో తీశారు. ఈ రెండు సినిమాల్లోనూ ఒక సీన్ ఉంటుంది. హీరో ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి సడెన్ గా అస్వస్థతకి గురైతే హీరో బైక్ మీద కూర్చోపెట్టుకొని హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. డైరెక్ట్ హాస్పిటల్ లోపలి తీసుకెళ్లి జాయిన్ చేస్తాడు. ఆ సీన్ మొదట చూడటానికి కామెడీగా ఉన్నా, అలా చాలా ఫాస్ట్ గా తీసుకొచ్చినందుకే బతికాడు అంటూ తర్వాత ఎమోషన్ చూపిస్తారు.
Also Read : Oy Movie : ‘ఓయ్’ టైటిల్‌లోనే ఇంత కథ ఉందా? ఓయ్ సినిమాకి అల్లు అర్జున్ కి సంబంధం ఏంటి?
ఇప్పుడు ఇదే సీన్ రియల్ గా జరిగింది. మధ్యప్రదేశ్ లోని సాత్నా జిల్లా ఆసుపత్రికి ఓ వ్యక్తి తన తాతయ్యని బైక్ పై తీసుకొచ్చాడు. ఎమెర్జెన్సీ అంటూ హాస్పిటల్ లోపలికి తీసుకొచ్చి జాయిన్ చేసాడు. అనంతరం బైక్ బయట పార్కింగ్ చేసి మళ్ళీ హాస్పిటల్ కి వచ్చాడు. ప్రస్తుతం ఆ పెద్దాయనకు చికిత్స అందిస్తున్నారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. తన తాతయ్యని అత్యవసర పరిస్థితిలో అంబులెన్స్ కోసం వెయిట్ చేయకుండా ఇలా తీసుకొచ్చి కాపాడినందుకు నెటిజన్లు అతన్ని అభినందిస్తున్నారు.
सतना के जिला अस्पताल में दिखा 'थ्री ईडियट्स' फिल्म का सीन, मरीज को बाइक से इमरजेंसी वार्ड तक लेकर पहुंचा शख्स
पूरी खबर पढ़ें – https://t.co/KK7OyCPqHG#satna #viralvideo #3idiots #viral #madhyapradesh #ndtvmpcg pic.twitter.com/a58ueNlBb0
— NDTV MP Chhattisgarh (@NDTVMPCG) February 11, 2024
