ఆమె ఎవరు?

47 డేస్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : April 18, 2019 / 05:59 AM IST
ఆమె ఎవరు?

Updated On : April 18, 2019 / 5:59 AM IST

47 డేస్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

జ్యోతిలక్ష్మీ, ఘాజీ, బ్లఫ్ మాస్టర్ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా 47 డేస్.. పూజా ఝవేరి, రోషిని ప్రకాష్ ఫీమేల్ లీడ్స్‌గా నటిస్తున్నారు. సింగర్ కమ్ కంపోజర్ రఘ కుంచే ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నాడు. ప్రదీప్ మద్దాలి డైరెక్ట్ చేస్తున్న 47 డేస్ థియేట్రికల్ ట్రైలర్ రీసెంట్‌గా రిలీజ్ అయ్యింది. నాపేరు సత్య, అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్.. నాకు తెలిసి లైఫ్ కంటే పెద్ద మిస్టరీ ఏంలేదు.. అంటూ సాగే సత్యదేవ్ వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అయిన 47 డేస్ ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. తన గతాన్ని వెలికితీసి, తన ప్రస్తుతాన్ని వెంటాడుతున్న వ్యక్తిని సత్య ఎలా కనిపెట్టాడు? అనేది కథ అని ట్రైలర్‌ని బట్టి అర్థమవుతుంది.

సత్య ప్రకాష్, రవి వర్మ, హరితేజ, కిరీటి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా : జికె, ఎడిటింగ్ : ఎస్ఆర్ శేఖర్, సంగీతం : రఘు కుంచే, కొరియోగ్రఫీ : నిక్సన్ డి క్రూజ్, ఫైట్స్ : స్టంట్స్ శ్రీ, నిర్మాతలు : శశి భూషన్ నాయుడు, రఘు కుంచే, శ్రీధర్ మక్కువ, విజయ్ శంకర్, కో-ప్రొడ్యూసర్ : అనిల్ కుమార్ సోహానీ.

వాచ్ 47 డేస్ ట్రైలర్..