బాలీవుడ్ హీరోయిన్లు ఎక్కడికివెళ్లినా జనాల కళ్లు అన్నీ తమవైపు తిప్పుకునేలా చేస్తారన్న విషయం తెలిసిందే. వాళ్లతో సెల్ఫీ కోసం ఇక అభిమానుల పాట్లు చెప్పేవి కాదనుకోండి.వాళ్లు వాడే చెప్పులు,డ్రెస్ లు,హ్యాండ్ బ్యాగ్ లు,తిరిగే కార్లు అన్నీ కొత్తగా,వెరైటీగా,ఖరీదైనవిగా ఉంటాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో ఏడుగురు టాప్ హీరోయిన్లు వాడుతున్న అత్యంత ఖరీదైన కార్ల గురించి ఒకసారి చూద్దాం.
1. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా
ఈ బాలీవుడ్ బ్యూటీ రోల్స్ రాయిస్ గోస్ట్ కారుని వాడుతోంది. దీని ధర రూ.5.65 కోట్లు. ఈ కారులో స్టార్‌లిట్ సీలింగ్‌లు మరియు స్టార్‌డస్ట్ తివాచీలు ఉండటమే కాకుండా, బిఎమ్‌డబ్ల్యూ తయారు చేసిన 6.6-లీటర్ ట్విన్-టర్బో V12 ను కలిగి ఉంది. ఇది 563 బిహెచ్‌పి పవర్ ని కలిగిస్తుంది. ఈ కారులో ప్రయాణిస్తుంటే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో…రిక్లెనయిర్ సీట్స్(పడుకునే సీట్లు)ఉన్న కార్లలో ప్రయానం చేయడం తనకు చాలా ఇష్టమని తెలిపింది.
2. మల్లిఖా షెరావత్
కొతంకాలంగా వెండితరెపైనుంచి ఈ బ్యూటీ మిస్ అయిపోయింది. తన ఫ్రెంచ్ బిజినెస్ మాన్- బాయ్ ఫ్రెండ్ సిరిల్లే ఆక్సెన్‌ఫాన్స్ తో లవ్ సిటీ(ప్యారిస్)లో ఈ అమ్మడు ఎంజాయ్ చేస్తోంది. విలాసవంతమైన కార్ల కలెక్షన్ కలిగి ఉన్న కొద్ది మంది బాలీవుడ్ హీరోయిన్లలో మల్లిఖా షెరావత్ ఒకరు. ఈ బ్యూటీ ఖరీదైన లాంబోర్గినీ అవెంటడార్ కారుని ఉపయోగిస్తోంది. దీని ధర రూ.5.01కోట్లు.
3. దీపికా పదుకొణె
తన సత్తాను మళ్లీ మళ్లీ ఫ్రూవ్ చేసుకుంటా అందరి ఎట్రాక్ట్ చేసే ఈ అమ్మడు
మెర్సిడెస్-మేబాచ్ ఎస్ 500 కారుని ఉపయోగిస్తోంది. ఈ కారు 4.7 లీటర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. గరిష్ట టార్క్ 700 ఎన్ఎమ్ తో కలిపి ఇది గరిష్టంగా 453 బిహెచ్‌పి పవర్ ను ఉత్పత్తి చేయగలదు. దీని ధర రూ.2.6కోట్లు. అంతేకాకుండా ఈ అందగత్తె దగ్గర ఆడిQ7, ఆడిA8 L,బిఎండబ్లూ 5 సిరీస్ సెడాన్ కార్లు కూడా ఉన్నాయండోయ్.
4. కత్రినాకైఫ్
బాలీవుడ్ అందగత్తెల్లో కత్రినా కైఫ్ పేరు ఎప్పుడూ టాప్ లో ఉంటుంది. గతేడాది మేలో తనకు తానే ఈ అమ్మడు రేంజ్ రోవ్ వోగ్ కారుని గిఫ్ట్ గా ఇచ్చుకుంది. బాలీవుడ్ సెలబ్రిటీల ఫేమస్ కారుగా కూడా దీనికి పేరుంది. కత్రినా కారు 4.4-లీటర్ SD-V8 డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 3500 ఆర్‌పిఎమ్ వద్ద 335 బిహెచ్‌పిని ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 8.70 కిలోమీటర్ల ఇంధన సామర్థ్యంతో పాటు ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ కలిగి ఉంది.
5. జాన్వీ కపూర్
ప్రస్తుతం అత్యంత చిన్నవయస్సు ఉన్న బాలీవడ్ హీరోయిన్లలో జాన్వీకపూర్ ఒకరు. ఈ అమ్మడు ఇటీవల బ్యాండ్ న్యూ మెర్సిడెస్-మేబాచ్ S650కారుని కొనుగోలు చేసింది. 2కోట్ల రూపాయల ఖరీదైన ఈ కారు నెంబర్ MH02FG7666. ఈనెంబర్ కి ఓ ప్ర్యతేకత ఉందండోయ్. ఈ చివరి నాలుగు అంకెలు… తన తల్లి దివంగత శ్రీదేవి వాడిన వైట్ మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ కారు చివరి నాలుగు అంకెలు ఒకటే.
6.కరీనా కపూర్
ఈ బాలీవుడ్ బేగం సాధారణంగా భర్త సైఫ్ అలీ ఖాన్, కుమారుడు తైమూర్‌లతో కలిసి వైట్ రేంజ్ రోవర్ స్పోర్ట్‌లో ముంబై రోడ్లపై తిరుగుతుంటది. ఈ కారు పెట్రోల్,డీజిల్ రెండు ఆప్షన్లు కలిగి ఉంటది. 5లీటర్ గ్యాస్ ట్యాంక్, ఇంజన్లు రేంజ్ V6s నుండి సూపర్ఛార్జ్డ్ V8 వరకు ఉంటాయి. ఈ కారు బరువు 2.8టన్నులు ఉంటుంది. కేవలం 5.3 సెకన్లలోనే సున్నా నుంచి వంద స్పీడ్ వరకు ఈ కారు ప్రయాణించగలదు. దీని ధర రూ.1.56కోట్లు.
7.సన్నీ లియోన్
అందాల తార సన్నీలియోన్ బయట ఎక్కడైనా పబ్లిక్ లో కనిపించిందంటే చాలు చుట్టూ ఈగలమాదిరిగా జనాలు గుమిగూడతారు. మొన్నామధ్య సన్నీ కేరళలోని కొచ్చిన్ వెళ్లినప్పుడు లక్షల మంది జనం చీమల్లా సన్నీ కారుచుట్టుముట్టారు. తన ప్యాన్స్ అందరికీ సెల్ఫీలు ఇవ్వాలంటే సన్నీకి ఎన్ని సంవత్సరాలు పడుతుందో. ఈ బ్యూటీ లిమిటెడ్ ఎడిషన్ మసెరటి ఘిబ్లి నెరిసిమో కారుని 2017లో ఇంటికి తెచ్చుకుంది. ప్రపంచంలో ఈ మోడల్ కారులు 450మాత్రమే ఉన్నాయంట. ఈ 450 కార్లలో ఒకటి సన్నీ దగ్గర ఉంది. దీని ధర రూ.1.36కోట్లు. నిస్సందేహంగా సన్నీ గ్యారేజ్ లో ఉన్న ఖరీదైన,మోస్ట్ పవర్ ఫుల్ కార్లలో ఇది ఒకటి. కేవలం 4.7సెకన్ల వ్యవధిలోనే 0-100కిలోమీటర్ల స్పీడ్ తో,గంటలకు 283 కిలోమీటర్లకు చేరుకోగలదు ఈ కారు.