కార్తికేయ, నేహా సోలంకి జంటగా.. జంటగా నటిస్తున్న‘90 ఎంఎల్’ 3 పాటల చిత్రీకరణతో షూటింగ్ పూర్తి చేసుకుంది..
కార్తికేయ, నేహా సోలంకి జంటగా.. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై, శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకుడిగా పరిచయం చేస్తూ అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్న సినిమా ‘90 ఎంఎల్’. ఇటీవల విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం విశేషాలను నిర్మాత అశోక్‌రెడ్డి గుమ్మకొండ వివరిస్తూ..
‘టైటిల్‌కి తగ్గట్టుగానే ఈ సినిమా వైవిధ్యంగా ఉంటుంది. అలాగే కమర్షియల్ అంశాలతో వినోదాత్మకంగా ఉంటుంది. ఇటీవలే మూడు పాటలను అజర్ బైజాన్‌లో చిత్రీకరించాం. దీంతో చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అతి త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’ అని చెప్పారు.
Read Also : ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్‌కు నిర్మాతల సాయం
దర్శకుడు శేఖర్ రెడ్డి ఎర్ర మాట్లాడుతూ : ‘అజర్ బైజాన్ రాజధాని బాకులోని బ్యూటీఫుల్ లొకేషన్స్‌లో.. సీజీ మౌంటెయిన్స్ దగ్గర, క్యాస్పియన్ సముద్రం దగ్గర 8 రోజుల పాటు ఈ మూడు పాటల్ని చిత్రీకరించాం. హీరో, హీరోయిన్‌పై ‘వెళ్లిపోతుందే వెళ్లిపోతుందే’ అనే ఎమోషనల్ గీతాన్ని చిత్రీకరించాం. ‘సింగిల్ సింగిల్’ అనే పాటను ఫుల్ డ్యాన్స్ నెంబర్‌గా హీరో, హీరోయిన్, 20 మంది డ్యాన్సర్లపై తీశాం. ‘నాతో నువ్వుంటే చాలు’ అనే డ్యూయట్‌ని హీరో, హీరోయిన్, 10 మంది డ్యాన్సర్లపై షూట్ చేశాం. ఈ 3 పాటలకూ జానీ మాస్టర్ ఎక్స్‌ట్రార్డినరీగా స్టెప్స్ కంపోజ్ చేశారు. ఈ సినిమాలో ఈ పాటలు మంచి హైలైట్‌గా నిలుస్తాయి’ అని తెలిపారు.
కార్తికేయ, నేహా సోలంకి, రవికిషన్, రావు రమేష్, ఆలీ, పోసాని కృష్ణమురళి, అజయ్, ప్రగతి, ప్రవీణ్, కాలకేయ ప్రభాకర్, అదుర్స్ రఘు, సత్య ప్రకాష్, రోల్ రిడా, నెల్లూర్ సుదర్శన్, దువ్వాసి మోహన్ తదితరులు ఈ చిత్రంలో నటించిన ‘90 ఎంఎల్’ త్వరలో విడుదల కానుంది.
.@ActorKartikeya‘s #90ml team wraps up the shoot of 3 songs in picturesque locations of Azerbaijan & CG Mountains while making up the post production works on brisk pace.@NehaSolanki_ @Shekhar_Dreamz @anuprubens @kcwoffl @AshokGummakonda #JYuvraj @SrSekkhar @AlwaysJani pic.twitter.com/IcKU6n19h4
— Pulagam Chinnarayana (@PulagamOfficial) November 5, 2019