కార్తికేయ, నేహా సోలంకి జంటగా.. శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకత్వంలో రూపొందిన ‘90 ఎంఎల్’ డిసెంబర్ 5న విడుదల కానుంది..
కార్తికేయ, నేహా సోలంకి జంటగా.. శేఖర్ రెడ్డి ఎర్రని దర్శకుడిగా పరిచయం చేస్తూ, సరస్వతి శుక్లా సమర్పణలో కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్న సినిమా ‘90 ఎంఎల్’. ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్, లిరికల్ సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల అజర్‌బైజాన్‌లో చిత్రీకరించిన మూడు పాటలతో షూటింగ్ పూర్తయింది.
ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘90 ఎంఎల్’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది మూవీ టీమ్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ హక్కులను ఫ్యాన్సీ రేటుకు శ్రీ వైష్ణవి ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ సొంతం చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిశెంబర్ 5న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ‘హిప్పీ’, ‘గుణ 369’, ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ (నెగెటివ్ క్యారెక్టర్) తర్వాత కార్తికేయ హీరోగా ఈ ఏడాది రిలీజ్ అవుతున్న మూడో సినిమా ఇది.
Read Also : కపిల్ దేవ్ కాదు రణ్‌వీర్
కమర్షియల్ అంశాలతో వినోదాత్మకంగా రూపొందిన ‘90 ఎంఎల్’ లో రవికిషన్, రావు రమేష్, ఆలీ, పోసాని కృష్ణమురళి, అజయ్, ప్రగతి, ప్రవీణ్, కాలకేయ ప్రభాకర్, అదుర్స్ రఘు, సత్య ప్రకాష్, రోల్ రిడా, నెల్లూర్ సుదర్శన్, దువ్వాసి మోహన్ తదితరులు నటించారు. సంగీతం : అనూప్ రూబెన్స్, కెమెరా : జె.యువరాజ్, ఎడిటింగ్ : ఎస్.ఆర్.శేఖర్.