A Legal Notice from Tamilnadu Government to Nayanthara Couple
Nayanthara: ఈ ఆదివారం నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ.. వారిద్దరూ కవలలకు జన్మనిచ్చి తల్లిదండ్రులు అయ్యినట్లు ప్రకటించారు. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకుని 4 నెలలు మాత్రమే కావడంతో.. ఈ జంట అద్దె గర్భం ద్వారా కవలలకు తల్లిదండ్రులు అయ్యారని తెలుస్తుంది.
Nayanthara Vignesh Shivan : కవలలకు తల్లి అయిన నయనతార.. ముందే చెప్పిన ఎన్టీఆర్..! మ్యాటర్ ఏంటంటే..
నయనతార, నేను అమ్మానాన్నలుగా మారమంటూ.. విఘ్నేష్ శివన్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించడంతో, కొంతమంది వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరికొంతమంది వీరిద్దరూ చేసిన పనిని విమర్శిస్తున్నారు. అదేంటంటే భారతదేశంలో సరోగసీ చట్టరీత్యా నేరం.
గర్భం దాల్చలేని సందర్భంలో తప్ప, అద్దె గర్భం ద్వారా తల్లిదండ్రులు అవ్వడం నేరం. ఈ చట్టం జనవరి 2022 నుండి అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం.. “పిల్లలు ఎలా పుట్టారో వివరాలు సమర్పించాలంటూ” నయనతార, విఘ్నేష్ శివన్ లను వివరణ కోరింది. మరి దీనిపై నయన్ దంపతులు ఎలా స్పందిస్తారో చూడాలి.