Nani : నాని కోసం సుదర్శన్ థియేటర్‌కి వచ్చిన బామ్మ.. నాని ఫ్యాన్స్‌తో కలిసి సందడి..

నాని సరిపోదా శనివారం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ఓ బామ్మ వచ్చింది.

A old Lady came for Nani Saripodhaa Shanivaram Movie Trailer Launch Event

Nani : నాని త్వరలో సరిపోదా శనివారం అనే సినిమాతో రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ లో జరిగింది. సాధారణంగా సుదర్శన్ థియేటర్ లో ఈవెంట్స్ జరిగినా, సినిమాలు రిలీజ్ అయినా హీరోల అభిమానులు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. మొత్తం థియేటర్ అంతా నిండిపోతుంది, ఆ రోడ్ అంతా ట్రాఫిక్ ఉంటుంది. థియేటర్ లో అరుపులు, గోలలతో రచ్చ చేస్తారు. ఇక్కడికి వచ్చేదంతా యూత్ ఉంటారు.

అయితే నాని సరిపోదా శనివారం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ఓ బామ్మ వచ్చింది. ఈవెంట్లో నాని మాట్లాడుతుంటే హీరోయిన్ ప్రియాంక వచ్చి జనాల్లో కూర్చున్న బామ్మని చూపించింది. బామ్మని చూసిన నాని.. బామ్మ గారు హాయ్. నేను ఇప్పుడే వచ్చే దారిలో మీరు పోస్టర్ ముందు ఫొటో దిగుతుంటే చూసాను. మీ మనవడిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ రోజు ఈ ఈవెంట్లో మీరు స్పెషల్ హైలెట్ అని అన్నారు. దీంతో ఆ బామ్మ వైరల్ గా మారింది.

Also Read : Samantha – Raj : వాట్.. సమంత ఇతనితో డేటింగ్‌లో ఉందా? ఎవరితను? ఆ రూమర్స్ నిజమేనా?

మాములుగా నానికి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఉంటారని తెలిసిందే. కానీ ఇలా ఫ్యాన్స్ అంతా రచ్చ చేసే ఈవెంట్ కి బామ్మ రావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

ట్రెండింగ్ వార్తలు