Samantha – Raj : వాట్.. సమంత ఇతనితో డేటింగ్‌లో ఉందా? ఎవరితను? ఆ రూమర్స్ నిజమేనా?
ఇప్పుడు సమంత - రాజ్ లవ్ లో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారని బాలీవుడ్ వార్తలు వస్తున్నాయి.

Samantha in Love with Raj Rumours goes Viral after Naga Chaitanya Sobhita Engagement
Samantha – Raj : నాగచైతన్య – సమంత విడిపోయాక ఎవరి కెరీర్ లో వాళ్ళు బిజీ అయ్యారు. వీళ్ళు విడిపోయిన తర్వాత నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళతో డేటింగ్ లో ఉన్నాడని, సమంత రాజ్ నిడుమోరు అనే వ్యక్తితో డేటింగ్ లో ఉందని వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల ఆ రూమర్స్ ని నిజం చేస్తూ నాగ చైతన్య – శోభిత ధూళిపాళ నిశ్చితార్థం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు సమంత రూమర్ కూడా నిజం కావొచ్చు అని అంటున్నారు.
సమంతని ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో బాలీవుడ్ కి పరిచయం చేసారు రాజ్ &డీకే. వీరిద్దరూ దర్శక నిర్మాతలుగా పలు సినిమాలు, సిరీస్ లు నిర్మిస్తున్నారు. వీరిలో రాజ్ నిడుమోరుతో సమంత డేటింగ్ లో ఉందని సమాచారం. ఫ్యామిలీ మ్యాన్ 2తో పరిచయమయిన వీరు ఆ తర్వాత సిటాడెల్ సిరీస్ లో కూడా కలిసి పనిచేసారు. ఈ సమయంలో రాజ్ – సమంత మధ్య మంచి స్నేహం ఏర్పడింది. వీరు ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని, లవ్ లో ఉన్నారని ఇప్పుడు బాలీవుడ్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి.
గతంలో కూడా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు చాలానే వైరల్ అయ్యాయి. సమంత పుట్టిన రోజుని రాజ్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసాడు కూడా. ఇప్పుడు సమంత – రాజ్ లవ్ లో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారని బాలీవుడ్ వార్తలు వస్తున్నాయి. అలాగే వీరిద్దరూ కూడా త్వరలో నిశ్చితార్థం చేసుకుంటారని అంటున్నారు. నాగ చైతన్య – శోభిత నిశ్చితార్థం తర్వాతే ఈ జంట గురించి బయటకు రావడంతో చర్చగా మారింది. మరి దీనిపై సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి.