Republic 2: పవర్ స్టార్ హీరోగా మేనల్లుడి సినిమాకు సీక్వెల్?
రిపబ్లిక్ సినిమాతో దర్శకుడు దేవాకట్టా మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్థానం సినిమా తర్వాత మళ్ళీ అలాంటి ఇంటెన్షన్ ఉన్న సినిమా రిపబ్లిక్ గా దేవాకి..
- Naresh Mannam
- Published On : December 22, 2021 / 04:57 PM IST
Republic 2
Republic 2: రిపబ్లిక్ సినిమాతో దర్శకుడు దేవాకట్టా మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్థానం సినిమా తర్వాత మళ్ళీ అలాంటి ఇంటెన్షన్ ఉన్న సినిమా రిపబ్లిక్ గా దేవాకి పేరు తెచ్చిపెట్టింది. కాగా.. దేవాకట్టా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ఓ సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. గతంలోనూ ఆయన ప్రయత్నాలు చేసినా అవి వర్కవుట్ కాలేదు. నిజానికి రిపబ్లిక్ సినిమా కథ కూడా పవన్ ను దృష్టిలో పెట్టుకొనే రాసుకున్నాడట దేవాకట్టా.. కానీ ఆ కథ పవన్ వరకు వెళ్ళలేదు.
Priyanka Chopra: పేరు చివర భర్త పేరు తొలగింపు.. పీసీ రియాక్షన్ ఇదే
రిపబ్లిక్ సినిమాను పవన్ హీరోగా చేయాలని అనుకున్నా.. తన ఇమేజ్‌కు తగ్గట్టు కథ ఉందో.. లేదో.. అనే అనుమానంతో పవన్ దగ్గరకు వెళ్లలేదట. అయితే, మేనల్లుడు సాయి తేజ్‌తో ముందుకు వెళ్లడం ఆ సినిమా అలా పూర్తవడం జరిగిపోయాయి. సినిమా కూడా మంచి సక్సెస్ అనిపించుకుంది. కాగా, దేవా ఇప్పుడు రిపబ్లిక్ 2 ప్రయత్నాలలో ఉన్నాడట. అది కూడా పవన్ హీరోగా ఈ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. స్వయంగా ఈ విషయాన్ని ఆయనే చెప్పుకొచ్చారు.
Bangarraju: సంక్రాంతికి ఉన్నట్లా.. లేనట్లా? టెన్షన్ పెట్టేస్తున్న అక్కినేని హీరోలు!
రిపబ్లిక్ సీక్వెల్ చేసే అవకాశాలు ఉండగా.. అది పవన్‌తో చేసే అవకాశాలు ఉన్నాయని, ఆయన దగ్గరకు వెళ్లాలని అనుకుంటున్నట్టు దేవకట్టా అన్నారు. ప్రస్తుతానికి ఐడియా స్టేజిలో ఉన్న ఈ కథ కంప్లీట్ స్క్రిప్ట్ డెవలప్ అయ్యేసరికి కొంత సమయం పడుతుంది. మరి అప్పటికి పరిస్థితిలు ఎలా ఉంటాయో.. పవన్‌తో చేయాలని తాపత్రయపడుతున్న దేవ కట్టాకు ఆ అవకాశం దక్కుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం పవన్ కమిటయిన ప్రాజెక్ట్స్ పూర్తవడానికి చాలానే సమయం పడుతుంది కనుక ఈ లోపు కథను ఆయన స్థాయికి తగ్గట్లు రెడీ చేసుకొని ఒప్పిస్తే ప్రాజెక్ట్ పట్టాలెక్కడం కూడా పెద్ద పనేమీ కాదు.
