‘గురు’ ఫేమ్ సుధ కొంగర దర్శకత్వంలో 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య నటిస్తూ, నిర్మిస్తున్న ‘ఆకాశం నీ హద్దురా’ ఫస్ట్‌లుక్ రిలీజ్..
తమిళ స్టార్ హీరో సూర్య కొత్త సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. ఎయిర్ ఇండియా ఫౌండర్ కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ జీవితంలోని ముఖ్య సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాకు తమిళ్‌లో ‘సూరరై పోట్రు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
‘గురు’ ఫేమ్ సుధ కొంగర దర్శకత్వంలో 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య నిర్మిస్తున్న ‘సూరరై పోట్రు’లో, అపర్ణా బాలమురళి హీరోయిన్.. తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో డబ్ చేస్తున్నారు. ‘‘ఇతడే మారా… అసాధారణ కలలుగల సాధారణ మనిషి’’ అని సూర్య ఫస్ట్‌లుక్ పోస్టర్స్ షేర్ చేశారు.
Read Also : జయలలిత బయోపిక్ ‘తలైవి’ ప్రారంభం
ఆకాశమే హద్దు అన్నట్టు రెండు చేతులు చాపి సూర్య గాల్లో ఎగురుతున్న లుక్ ఆకట్టుకుంటోంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. 2020 వేసవిలో ‘ఆకాశం నీ హద్దురా’ విడుదల కానుంది. త్వరలో టీజర్ రిలీజ్ చేయనున్నారు. సంగీతం : జీవీ ప్రకాశ్‌కుమార్, కెమెరా: నికేత్ బొమ్మి, ఎడిటింగ్ : సతీష్ సూర్య.
Here’s Maara.. An ordinary man with an extraordinary dream!#SooraraiPottruFirstLook #AakaasamNeeHaddhuRa#SudhaKongara @gvprakash @nikethbommi @Aparnabala2 @editorsuriya @jacki_art @rajsekarpandian @guneetm @SuperAalif @SakthiFilmFctry @gopiprasannaa @PoornimaRamasw1 pic.twitter.com/QwDNCGgFMN
— Suriya Sivakumar (@Suriya_offl) November 10, 2019