Aamir Khan And Kiran Rao : బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే..టాలీవుడ్ నటుడు నాగ చైతన్య షేర్ చేసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇందులో నాగ చైతన్యతో పాటు..అమీర్ ఖాన్, కిరణ్ రావులున్నారు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్ లో అమీర్ – కిరణ్ రావులు సంయుక్త నిర్వాహణలో లాల్ సింగ్ చద్దా (Laal Singh Chaddha) ఫిల్మ్ రూపొందుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో నాగ చైతన్య కీలక పాత్ర పోషించనున్నారు. గతంలో ఈ పాత్ర గురించి విజయ్ సేతుపతిని సంప్రదించారనే టాక్ ఉంది. ఫొటోలో అమీర్ ఖాన్ మీసాలు తీసేసి ఉండగా..నాగ చైతన్య కొద్దిపాటి మీసంతో కనిపిస్తున్నారు. వీరిద్దరూ మిలట్రీ డ్రెస్ లో ఉన్నారు. ఫొటో వెనుకాల పర్వతాలను బట్టి చూస్తే..వీరు లడఖ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడే ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోందని సమాచారం. చైతూ నటించిన `లవ్‌స్టోరి` విడుదలకు సిద్ధంగా ఉంది.
ఆస్కార్ అవార్డు విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’(1994)కు ఇది హిందీ రీమేక్ అనే సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఎన్నో సినిమా షూటింగ్ రద్దయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొన్ని రంగాలకు అనుమతులు ఇస్తుండడంతో షూటింగ్ లు ప్రారంభించారు. లాల్ సింగ్ చద్దా మూవీ షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభమైంది.
Welcome Bala, stealer of hearts, you have already stolen ours ?
Love.
Kiran & Aamir.@chay_akkineni pic.twitter.com/HC2qfFSomm— Aamir Khan Productions (@AKPPL_Official) July 9, 2021
Grateful #Bala #LaalSinghChaddha pic.twitter.com/hLidCDCcyf
— chaitanya akkineni (@chay_akkineni) July 9, 2021