Aamir Khan: తను దేశంలోనే బెస్ట్ యాక్ట్రెస్.. సాయి పల్లవి గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్న ఆమిర్ ఖాన్
'ఏక్ దిన్' సినిమాలో సాయి పల్లవి నటన గురించి మాట్లాడుతూ ఆమిర్ ఖాన్(Aamir Khan) భావోద్వేగానికి లోనయ్యారు.
- V Santhosh Kumar
- Published on- April 29, 2026 / 02:26 PM IST
Aamir Khan gets emotional while speaking about Sai Pallavi acting in Ek Din movie
- సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ.
- ముగ్ధుడై కన్నీళ్లు పెట్టుకున్న అమీర్.
- ప్రస్తుతం దేశంలోనే బెస్ట్ యాక్ట్రెస్.
Aamir Khan: సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి సాయి పల్లవి. గ్లామర్ పాత్రలు కాకుండా, కేవలం కథా బలమున్న సినిమాలు చేస్తూ లేడీ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది ఈ మలయాళ చిన్నది. ఇప్పుడు బాలీవుడ్ బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం అయ్యింది. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ సరసన ఆమె నటించిన లేటెస్ట్ మూవీ ‘ఏక్ దిన్’. ప్యూర్ లైవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా మే 1న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కొంతమంది ప్రముఖుల కోసం స్పెషల్ షో నిర్వహించారు.
Aadhi- Nikki: పారిస్ వీధుల్లో ప్రేమ పక్షులు.. ఆది-నిక్కీ రొమాంటిక్ విహారం.. ఫొటోలు వైరల్
ఈ ప్రదర్శనలో సాయి పల్లవి నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, భావోద్వేగాలను పండించిన తీరు చూసి బాలీవుడ్ వర్గాలు ఫిదా అవుతున్నాయి. ముఖ్యంగా తన తొలి హిందీ సినిమాతోనే ఆమె ఉత్తరాది ప్రేక్షకులను ఎలా మెప్పించబోతుందో అన్న ఆసక్తి ఇప్పుడు సినీ వర్గాల్లో నెలకొంది. ఈ చిత్ర ప్రదర్శన అనంతరం బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్(Aamir Khan) భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడం విశేషం. తన కుమారుడి సినిమా అయినప్పటికీ, జునైద్ కంటే సాయి పల్లవి నటన తనను ఎక్కువగా కదిలించిందని ఆయన బహిరంగంగా ఒప్పుకున్నారు. ప్రస్తుతం భారత చిత్రసీమలో ఉన్న అత్యుత్తమ నటీమణుల్లో సాయి పల్లవి ఒకరని ఆయన ప్రశంసించడం సంచలనంగా మారింది.
అమీర్ ఖాన్ వంటి దిగ్గజ నటుడి నుండి ఇటువంటి ప్రశంసలు దక్కడం సాయి పల్లవి ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోంది. ఆమె నటనలోని సహజత్వం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు బాలీవుడ్ ఎంట్రీపై సాయి పల్లవి ఎంతో వినమ్రంగా స్పందించింది. దక్షిణాదిలో ఎన్నో విజయాలు అందుకున్నప్పటికీ, కొత్త భాష, కొత్త వాతావరణం తనకు కొంత ఆందోళన కలిగిస్తున్నాయని ఆమె చెప్పుకొచ్చారు. అమీర్ ఖాన్ భావోద్వేగాన్ని చూసి తానూ చలించిపోయానని, కానీ ఆ విషయాన్ని బయటకు వ్యక్తం చేయలేకపోయానని ఆమె పేర్కొన్నారు. ఈ సినిమా తర్వాత ఆమె రణబీర్ కపూర్ సరసన ‘రామాయణం’ వంటి ప్రతిష్టాత్మక చిత్రంలో సీతగా నటిస్తుండటంతో, బాలీవుడ్‌లో సాయి పల్లవి ప్రస్థానం అద్భుతంగా సాగనుందని అభిమానులు ఆశిస్తున్నారు.
